వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..

|
Google Oneindia TeluguNews

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ ముఖ్య నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఆర్థిక నేరాల వింగ్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఆయనతోపాటు మరో 69 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటిట్ బ్యాంక్ స్కాం (ఎంఎస్సీబీ) కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అజిత్ పవార్‌పై దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి.

ఎంఎస్సీబీ కుంభకోణంలో అజిత్ పవార్ సహా మరో 69 మందిపై ఈవోడబ్ల్యూ కేసు నమోదు చేసింది. బొంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్థిక నేరాల విభాగం కేసు కట్టింది. అజిత్ పవార్‌పై కేసు నమోదు చేసేందుకు ముంబై పోలీసులకు హైకోర్టు ఐదురోజుల సమయం ఇచ్చింది.

FIR against NCP leader Ajit Pawar, 69 others

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్ సహా 69 మందిపై 420, 506, 409, 465, 465. 467 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతోపాటు పీడబ్ల్యూపీ పార్టీకి చెందిన జయంత్ పాటిల్, బ్యాంకు అధికారులపై కూడా అభియోగాలు నమోదు చేశారు. ఎంఎస్సీబీ బ్యాంకు రాష్ట్రంలోని 34 జిల్లాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
eonomic Offences Wing (EOW) of the Mumbai Police on Monday filed an FIR against Nationalist Congress Party (NCP) leader and former Deputy Chief Minister Ajit Pawar and 69 others in the multi-crore Maharashtra State Cooperative Bank (MSCB) scam case. The FIR was filed on the direction of the Bombay High Court. The high court had given five-day time to the Mumbai Police to file an FIR against Ajit Pawar. The FIR against Ajit Pawar and others have been filed under Sections 420, 506 409 465, 467 of the Indian Penal Code (IPC). The other accused in the case include Peasants and Workers Party (PWP) leader Jayant Patil and officials from the superseded bank's units in 34 districts in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X