వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీర్ బాటిళ్ళపై 'వినాయకుడు', బూట్లపై 'ఓం 'ముద్రించి విక్రయాలు, కేసులు

హిందూ మతాన్ని కించపర్చేలా వ్యవహరిస్తున్న రెండు వెబ్ సైట్లపై కేసులు నమోదయ్యాయి. హిందువులు పవిత్రంగా భావించే 'ఓం' చిహ్నన్ని 'బూట్లపై' ముద్రించి విక్రయించడం, బీర్ బాటిల్ పై 'వినాయకుడి' బొమ్మను ముద్రించి

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:హిందూ మతాన్ని కించపరిచినందుకుగాను అమెరికాకు చెందిన రెండు వెబ్ సైట్లపై కేసులు నమోదయ్యాయి. హిందువులు పవిత్రంగా భావించే ఓం' చిహ్నన్ని 'బూట్లపై' ముద్రించి అమ్ముతున్నందుకుగాను 'యస్ విబే' అనే వెబ్ సైట్ పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమీషనర్ నరేష్ కాడ్యాన్ ఈ మేరకు ఈ రెండు వెబ్ పైట్లపై ఫిర్యాదు చేశాడు. హిందువుల చేత ప్రథమంగా పూజలు అందుకొనే దేవుడిగా వినాయకుడు ప్రసిద్ది చెందాడు.అయితే అలాంటి వినాయకుడి బొమ్మను బీర్ బాటిల్ పై ముద్రించి విక్రయిస్తున్నారు.

FIR against US-based online companies over ‘Om’ on shoes, ‘Ganesha’ on beer bottles

'లాస్ట్ కోస్ట్ 'వెబ్ సైట్ 'వినాయకుడి 'బొమ్మను ముద్రించి బీర్ బాటిల్ ను విక్రయిస్తున్నారు. ఈ రెండు వెబ్ సైట్లపై కేసులు నమోదు చేయాలని విదేశాంగ మంత్రిత్వశాఖకు ఆయన లేఖ రాశారు.

హిందువుల మనోభావాలకు దెబ్బతీసేలా ఉన్న ఉత్పత్తులను విక్రయించకుండా చూడాలని ఆయన కోరారు. అంతేకాదు ఈ మేరకు ఆయన ఢిల్లీోని ప్రశాతం విహర్ పోలీస్ స్టేషన్ లో కూడ ఫిర్యాదు చేశారు.

హిందూ మతాన్ని అవమానించేలా రెండు వెబ్ సైట్లు వ్యవహరించాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది జూన్ మాసంలో హిందూ దేవుళ్ళతో కూడి డోర్ మేట్లను 'అమెజాన్' కంపెనీ అమ్మకానికి పెట్టింది.

ఈ కంపెనీ తీరును భారతీయులు తీవ్రంగా ఆక్షేపించారు.విదేశాంగ వ్యవహరాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడ అమెజాన్ పై నిప్పులు చెరిగారు. దీంతో అమెజాన్ కంపెనీ వెనక్కు తగ్గింది.

హిందూ మతాన్ని కించపరిచినందుకుగాను అమెరికాకు చెందిన రెండు వెబ్ సైట్లపై కేసులు నమోదయ్యాయి. హిందువులు పవిత్రంగా భావించే ఓం చిహ్నన్ని బూట్లపై ముద్రించి అమ్ముతున్నందుకుగాను యస్ విబే అనే వెబ్ సైట్ పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

English summary
Following reports that two US-based online companies are selling shoes and beer bottles with images associated with Hindu religion, activist Naresh Kadyan has filed an FIR against the companies for allegedly hurting Hindu sentiments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X