వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామూలు మస్కా కాదు.. డమ్మీ నంబర్ ప్లేట్.. ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌తో...

|
Google Oneindia TeluguNews

ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారు నంబర్‌ను (ఎంహెచ్‌01 డికె 0111) ఓ మహిళ తన కారుకు వాడుకుంటోంది. సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల బారినపడకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ కనిపించకుండా జిమ్మిక్కులు చేయడం సర్వ సాధారణం. కానీ ఈ మహిళ ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌ను వాడుతూ ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టడం గమనార్హం.

ఇటీవల ఆ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ఈ-చలాన్లు విధించారు. రతన్ టాటా సిబ్బంది ఈ విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు చెప్తున్నారో... ఇటీవలి కాలంలో ఆ ప్రాంతాలకు తమ కారు వెళ్లలేదని చెప్పారు. బహుశా ఎవరైనా నకిలీ నంబర్ ప్లేట్ వాడుతుండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది.

FIR against woman for forgery of Ratan Tatas cars number

రతన్ టాటా కారు నంబర్‌ను మరో మహిళ తన కారుకు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను గీతాంజలి సామ్ షాగా గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే గీతాంజలి మాత్రం.. ఆ నంబర్ రతన్ టాటాది అన్న విషయం తనకు తెలియదని పోలీసులతో చెప్పారు. అంతేకాదు,ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఒకరు ఇచ్చిన సూచన మేరకు తాను ఆ కారు నంబర్ వాడుతున్నట్లు తెలిపారు. జీవితంలో మంచి స్థానంలో ఉండాలంటే ఆ నంబర్ వాడాలని న్యూమరాలజిస్ట్ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డమ్మీ నంబర్ ప్లేట్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

English summary
A case was registered against a woman here on Tuesday for alleged forgery of the registration number of a car owned by industrialist Ratan Tata, the city police said. With the discovery of the forgery, electronic fine receipts or e-challans'' for traffic rule violation recorded against Tata''s car have now been transferred in the woman''s name, an official said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X