వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Corona Lockdown: చర్చిలో సామూహిక ప్రార్థనలు, ఫాదర్ తో సహ అందరి మీద కేసు, వినరా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ఉడిపి: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. దేశవ్యాప్తంగా జాతరలు, ఉరుసులు, ప్రార్థనలు, అన్ని మతాల ఊరేగింపులను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి కర్ణాటకలోని ఉడిపిలోని ఓ చర్చిలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు సామూహిక ప్రార్థనలు నిర్వహించిన చర్చి ఫాదర్ తో సహ ఆ చర్చి నిర్వహకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

సాయంత్రం సామూహిక ప్రార్థనలు

సాయంత్రం సామూహిక ప్రార్థనలు

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని నాడా ప్రాంతంలోని పదుకొనేలో సెయింట్ ఆంటోని చర్చి ఉంది. సెయింట్ ఆంటోని చర్చిలో సాయంత్రం 6. 30 గంటల సమయంలో చర్చి ఫాదర్ ఫ్రెడ్ మస్కారెన్హాస్ ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరిగాయి. చర్చిలో జరిగిన సామూహిక ప్రార్థనలకు స్థానికులు హాజరైనారు.

 పీడీఓకు ఫిర్యాదు

పీడీఓకు ఫిర్యాదు

కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయని విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రాంతం పీడీఓకు ఫిర్యాదు చేశారు. పీడీఓ సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి చర్చిలో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయని సమాచారం.

 తహశీల్దార్, తాలుకా న్యాయాధికారి

తహశీల్దార్, తాలుకా న్యాయాధికారి

చర్చి దగ్గరకు వెళ్లిన పీడీఓ అక్కడ సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయని తెలుసుకుని బైందూరు తహశీల్దార్ బసప్ప. పి. పూజారి, తాలుకా న్యాయాధికారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి చర్చిలో సామూహిక ప్రార్థలు చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు చర్చి ఫాదర్ తో సహ ఆ చర్చి కమిటీ నిర్వహకులు ఆరు మంది మీద సెక్షన్ 144 (3) ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby
 మీరు అర్థం చేసుకోండి !

మీరు అర్థం చేసుకోండి !

లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అన్ని మతాలకు చెందిన పెద్దలు జాతరలు, ఊరేగింపులు, ఉరుసులు, సామూహిక ప్రార్థనలు నిర్వహించకూడదని అధికారులు మత పెద్దలకు మనవి చేస్తున్నారు. సామూహిక ప్రార్థనలు, జాతరలు, ఉరుసులు, ఊరేగింపులు నిర్వహిస్తే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని, దయచేసి అందరూ సహకరించాలని, ఎవరైనా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

English summary
Coronavirus: FIR has been registered on 6 for mass prayer at bainduru church onbehalf of good friday in Udipe in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X