వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పేషెంట్ల అరాచకం: క్వారంటైన్ గదుల బయటే మల మూత్ర విసర్జన..కరోనా వ్యాపించేలా: కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సహా దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ.. క్వారంటైన్లలో నగ్నంగా తిరుగాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తోన్న వారంతా మరో అరాచకానికి తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాము నివసిస్తోన్న క్వారంటైన్ల గదుల బయటే బహిరంగంగా మల విసర్జన చేస్తున్నారంటూ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో తాము విధులను నిర్వర్తించలేకపోతున్నామంటూ డాక్టర్లు, నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు మల విసర్జన చేసిన వారిని అరెస్టు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ భవన సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

FIR lodged on markaz prayers Attendees In Delhi, after complaint lodged by the doctors

కరోనా వైరస్ అనుమానితుల కోసం నరేలా ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. మర్కజ్ సామూహిక మత ప్రార్థనలకు హాజరైన వారు పెద్ద సంఖ్యలో ఈ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్వారంటైన్ భవన సముదాయంలోని రూమ్ 212లో ఉంటోన్న పేషెంట్లు అమానవీయ ప్రవర్తనకు పాల్పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. కారిడార్‌లో.. తమ గది బయటే వారు మలమూత్ర విసర్జన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ చర్యకు పాల్పడిన వారిలో ఇద్దరిని గుర్తించామని తెలిపారు. వారిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 25 సంవత్సరాల మహ్మద్ ఫహద్, 18 సంవత్సరాల అద్నాన్ జహీర్.. బహిరంగ మల విసర్జన చేశారని ఆ గది అటెండర్లు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు డాక్టర్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఉత్తర ప్రదేశ్‌లోని బారాబాంకీకి చెందిన వారని తెలిపారు. ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడుతుండటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసిన నియమ, నిబంధనలను పాటించట్లేదని పేర్కొన్నారు.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం-2005 కింద వారిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. క్వారంటైన్లలో ఉంటోన్న వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలు అనుసరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎవ్వరైనా వాటిని ఉల్లంఘిస్తే.. కఠినమైన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డాక్టర్లు, నర్సులకు సహకరించాలని సూచించారు.

English summary
In another appalling act by some of the COVID-19 quarantined members of the Tablighi Jamaat, some unknown people defecated outside a room in the Narela quarantine facility where they were lodged. The disgusting incident put all the people including the medical staff at risk of coronavirus infection. Acting swiftly on the crime, an FIR has been lodged. The open defecation happened outside Room No. 212. Two of the Tablighi Jamaat attendees, Mohammed Fahad and Adnam Zahir are quarantined in this room.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X