వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం, వాణిజ్య సముదాయంలో చెలరేగిన మంటలు, రంగంలోకి 12 ఫైరింజన్లు

|
Google Oneindia TeluguNews

ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు అందెరి శివారులోని వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. రోల్తాలో గల భవన సముదాయంలో పలు ఎమ్మెన్సీ కంపెనీలు ఉన్నాయి. ఓ కంపెనీలో గల సర్వర్ గది నుంచి మంటలు చెలరేగాయి. భవనం మొత్తం మూడు అంతస్తులు ఉండగా.. రెండో ఫ్లోర్‌లో ప్రమాదం జరిగింది.

రంగంలోకి 12 ఫైరింజన్లు..

రంగంలోకి 12 ఫైరింజన్లు..


అగ్నిప్రమాదం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే 12 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రమాదం జరిగిందని.. సాయంత్రం వరకు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు కూడా మంటలను ఆర్పే ప్రక్రియ కొనసాగింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.

11 జంబో వాటర్ ట్యాంకర్లు..

11 జంబో వాటర్ ట్యాంకర్లు..


12 ఫైరింజన్లతోపాటు 11 జంబో వాటర్ ట్యాంకర్లు కూడా సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. సర్వర్ గదిలో చెలరేగిన మంటలు ఇతర గదులకు వ్యాపించాయి. భవన సముదాయంలోకి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. మెట్లపై కూడా మంటలు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని వివరించారు.

వెంటిలేషన్ లేదు..

అగ్నిప్రమాదం జరిగిన భవనం ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. వెంటిలేషన్ లేదని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. గ్యాస్‌తో కప్పబడి ఉండటంతో గాలి బయటకు రావడం లేదని చెప్పారు. మంటలను ఆర్పివేసే సమయంలో శ్వాస తీసుకోవడానికి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

English summary
fire broke out at a commercial building in Mumbai's Andheri East suburb. The fire broke out at a building housing the offices of Rolta, an Indian multinational company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X