కోయంబత్తూరు బాణసంచా గోడౌన్లో భారీ ప్రమాదం
కోయంబత్తూరు: కోయంబత్తూరులో శుక్రవారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్ననే శివకాశిలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇది మరిచిపోకముందే కోయంబత్తూరు బాణసంచా గోడౌన్‌లో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గోడౌన్‌లో పలువురు చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ టీం రక్షిస్తోంది. దాదాపు మొత్తం పదిమంది అందులో చిక్కుకుపోగా, ఐదుగురిని బయటకు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా, అదే గోడౌన్ వద్ద ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పేలుడు సంభవించగానే విద్యార్థులు బయటకు పరుగెత్తుకు వచ్చారు.












Click it and Unblock the Notifications