వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రసిద్ది చెందిన లేడీ హార్జింజ్ ఆసుపత్రిలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కొంత ఆస్తి నష్టం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ఆసుపత్రిలో మంటలు వ్యాపించాయి.

వెంటనే ఆసుపత్రి వర్గాలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో ఆసుపత్రి దగ్గరకు చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

 Fire at Lady Harding hospital in New Delhi

విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన మంటలువ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఆసుపత్రి మొదటి అంతస్తులో మెడిసిన్ డిపార్ట్ మెంట్ లో తొలుత మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక ఏసీతో పాటు ఔషదాలు కాలిపోయాయని అగ్ని మాపక సిబ్బంది చెప్పారు.

40 నిమిషాలు మంటలు వ్యాపించాయని పోలీసు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సిబ్బంది స్పందించడంతో ప్రాణ నష్టం తప్పిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The fire broke out in the medicine wing room on the first floor. An air-conditioner and some medicines kept there were damaged in the blaze.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X