చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాణా‌సంచా కర్మాగారంలో పేలుడు, 8మంది మృతి

|
Google Oneindia TeluguNews

Fire breaks out at fireworks factory in Kumbakonam
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని వలుక్కచేరి బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం జరిగిన పేలుళ్లలో 8 మంది కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది కార్మికులు గాయపడ్డారు. కార్మికులు తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో బాణాసంచా కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

పేలుడు సమయంలో భారీ మంటలు వెలువడ్డాయి. కాగా పేలుడు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పాట్నా పేలుళ్ల నిందితుల్లో ఒకరు మృతి

పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గత ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో చేపట్టిన హుంకార్ ర్యాలీ సందర్భంగా సంభవించిన బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు అయినిల్ అలియాస్ తారిఖ్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పాట్నా రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం బాంబు అమరుస్తున్న సమయంలో పేలడంతో తారిఖ్ తీవ్రంగా గాయపడ్డాడు.

గాయపడిన తారిఖ్‌ను పోలీసులు పాట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న తారిఖ్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. కాగా గాంధీ మైదాన్ ప్రాంతాల్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, 83మంది గాయాలపాలయ్యారు.

English summary
Fire breaks out at fireworks factory in Kumbakonam in Thanjavur district of Tamil Nadu, eight killed and 20 injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X