వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: సీరం ఫార్మాలో మళ్లీ మంటలు -ఫైర్ ఫైటర్లకు సవాలుగా -ఇప్పటికే 5గురు మృతి..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలోని పుణె శివారులో గల సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద మరోసారి మంటలు చెలరేగాయి. నిర్మాణంలో ఉన్న భవంతిలో అగ్నిప్రమాదం సంభవించగా, ఇప్పటికే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలకు చెందిన 10కిపైగా ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మూడు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. కానీ..

Recommended Video

#Breaking పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో అగ్నిప్రమాదం

జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?

ఫైర్ ఫైటర్లకు సవాలు విసురుతూ భవంతిలో మరోసారి మంటలు చెలరేగాయి. తాజాగా తలెత్తిన మంటలను సైతం ఆర్పేందుకు అదనంగా ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవంతి నుంచి ఐదు మృతదేహాలను వెలికి తీసిన రెస్యూ సిబ్బంది.. లోపల ఇంకెవరైనా చిక్కుకుని ఉన్నారా అని శోధిస్తున్నారు.

Fire Breaks Out Again At Serum Institute Building Hours After 5 Die

పూణెలోని మంజరీ ప్రాంతంలో ఉన్న సీరమ్ ఫార్మా ప్రాంగణంలోని నిర్మాణ దశలో ఉన్న సెజ్‌3 భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో గురువారం జరిగిన అగ్నప్రమాదంలో చనిపోయిన ఐదుగురూ కాంట్రాక్టు కార్మికులేనని, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని సీరం సంస్థ ప్రకటించింది. మరోవైపు..

సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీసీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీ

దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తోన్న సీరం ఫార్మాలో అగ్నిప్రమాదం జరగడం, ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఈ ప్రమాదం వల్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం కలగలేదని, వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడలేదని సీరం సంస్థ ప్రకటించింది.

English summary
A fire broke out once again at the Serum Institute of India hours after a massive blaze left five people dead on Thursday at the vaccine-maker's Pune facility, at a building that is under construction. It is unlikely to hit the production of Covishield, the coronavirus vaccine developed by the SII in partnership with the Oxford University and British-Swedish pharma firm AstraZeneca.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X