వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ సీఎం క్యాంపు ఆఫీసులో అగ్నిప్రమాదం ...

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంపు కార్యాలయం లోక్ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. భవనం గ్రౌండ్ ప్లోర్‌లో పొగ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైరింజన్లు లోక్‌భవన్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

లోక్‌భవన్‌లో అగ్నిప్రమాదం ..
యూపీ సీఎం క్యాంపు కార్యాలయం లోక్‌భవన్‌లో అగ్నిప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిత్యం సీఎం .. వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంటారు. అలాంటి చోట అగ్నిప్రమాదం జరగడం భద్రత విభాగాన్ని ప్రశ్నిస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలనే ఆర్పివేశారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణమెంటో తెలియరాలేదు. గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్న సిబ్బంది సిగరెట్ పీక వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భవనం మొత్తం సెంట్రల్ ఏసీ అయినందున సిగరెట్ పీకను సరిగా ఆర్పకపోవడం వల్ల మంటలు చెలరేగయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Fire breaks out at Lucknows Lok Bhawan

అధికారుల అలర్ట్ ..
మంటలు చెలరేగిన వెంటనే .. గ్రౌండ్ ప్లోర్‌లో ఉన్న అధికారులు అప్రమత్తమయ్యారు. పై అంతస్తులో ఉన్నవారిని కిందకి రమ్మని కేకలు వేశారు. దీంతో అగ్నిప్రమాదం జరిగిన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం గమనార్హం. నీటి వనరుల విభాగం, ఇరిగేషన్ శాఖలపై యోగి సమీక్షించారు. ఆ కాసేపటికే అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదస్థలిని లక్నో ఎస్పీ కళనిధి పరిశీలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని .. ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

English summary
fire has been reported from the Lok Bhawan, the UP CM's office in Lucknow. Chaos erupted in Lucknow's Lok Bhawan after smoke from the fire spread. As of now, the exact cause behind the fire is not known. However, it is suspected that the fire was a result of cigarette smoking and the smoke spread due to the centralised airconditioning system. After the fire was reported, the ground floor of the Lok Bhawan was evacuated. All officials and staff on the ground floor were asked to step out of the building. UP CM Yogi Adityanath had just left the CMO before the smoke spread. He was there holding a meeting with officials from the Irrigation and Water Resources Department. Lucknow SSP Kalanidhi Naithani reached the spot and conducted an inspection of the ground floor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X