వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 గుడిసెలు దగ్ధం, నిరాశ్రయులైన వందలాది మంది, బస్తీలో భారీ అగ్నిప్రమాదం

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తుగ్లాకాబాద్ మురికివాడలో అర్ధరాత్రి 1.31 గంటలకు మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు కానీ.. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటలను ఆర్పివేయడంతో మురికివాడ జనం ఊపిరిపీల్చుకున్నారు.

Fire breaks out at slum in Delhis Tughlakabad, 200 shanties burnt

భారీగా ఎగసిపడుతోన్న మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటన్నర పైగా కష్టపడ్డారు. ఉదయం 3 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.. ప్రమాదంలో జనం ఎవరూ గాయపడలేదు.. కానీ పేదల 200 గుడిసెలు మంటలకు కాలి ఆహుతయ్యాయి. దీంతో వందలాది మందికి నిలువనీడ లేకుండా నిరాశ్రయులయ్యారు. మంటలు వాల్మికీ నగర్ బస్తీకి వ్యాపించడంతో... అక్కడికి కూడా ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పావేశాయి. ఇప్పుడే కాదు తుగ్లాకాబాద్‌లో గత నెల 26వ తేదీన కూడా ఇక్కడ సిలిండర్ పేలింది. దీంతో పొరుగున గల 100 గుడిసెలు కాలిపోయాయి.

English summary
fire broke out in the slums of Tughlakabad in Delhi early Wednesday. More than 200 shanties were burnt to ashes, while hundreds of its residents have now become homeless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X