వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని రైల్వే స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ ఫాం 8లో ఆగిన ఛండీగఢ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక రైలు, ఫ్లాట్ ఫాంలపై ఉన్న ప్రయాణికులు పరుగులు తీశారు.

భారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య ప్రవర్తనభారత సంతతి బాలిక వెంటపడి పాక్ యువకుడి అసభ్య ప్రవర్తన

అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి ప్రయాణికులను దూరంగా తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Fire breaks out in Chandigarh-Kochuveli Express at New Delhi railway station

12218 ఛండీగఢ్-కొచ్చువెల్లి ఎక్స్‌ప్రెస్‌లో రేర్ పవర్ కార్‌లో 1.40గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని నార్తర్న్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఫ్లాట్ ఫాం నెంబర్ 8 నుంచి రైలు కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నిలిచివున్న 12218 ఛండీగఢ్-కొచ్చువెల్లి ఎక్స్‌ప్రెస్‌లో రేర్ పవర్ కార్‌లో మంటలు చెలరేగాయని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ మేరకు ట్విట్టర్ విషయాన్ని తెలిపారు.

English summary
Afire broke out in the rear power car of the Chandigarh-Kochuveli Express as it was departing the New Delhi station on Friday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X