వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: కారులో నుంచి మంటలు...అందులోని వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూడండి

|
Google Oneindia TeluguNews

మంగళవారం సాయంత్రం గురుగ్రామ్ ఫ్లై ఓవర్ పై ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంటల్లో చిక్కుకున్న కారులో నుంచి ఓ వ్యక్తి బయటకు దూకాడు. అచ్చం సినిమా తరహాలో ఇది జరిగింది. కారులోనుంచి బయటకు దూకిన వ్యక్తి కారును ఆపేందుకు ప్రయత్నించాడు.

రాకేష్ అనే వ్యక్తి మంగళవారం తన బంధువులకు దివాళీ సందర్భంగా స్వీట్స్ ప్యాకెట్లు ఇచ్చి వద్దామని తన కారులో బయలుదేరాడు. తిరుగుప్రయాణంలో ఉన్నట్లుండి కారులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే రాకేష్ నడుస్తున్న కారులో నుంచి బయటకు దూకేసి ఆ కారును ఆపే ప్రయత్నం చేశాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

Fire emerges from a car in Gurugram,man jumps off the car

రాజీవ్ చౌక్ ఫ్లై ఓవర్‌పై చోటుచేసుకున్న ఈ ఘటనలో కారులోనుంచి దూకిన రాకేష్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టకుండా కారును నిలువరించేందుకు పరుగులు తీస్తున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. కారు నుంచి ఏదో శబ్దం వస్తుండటంతో కారును ఆపి టైర్లు చెక్ చేసినట్లు చెప్పాడు రాకేష్. అయితే అంతా బాగానే ఉండటంతో తిరిగి కారును స్టార్ట్ చేసి వెళ్లినట్లు చెప్పాడు.

కొంత దూరం ప్రయాణించాకా మళ్లీ అదే శబ్దం రావడం గమనించినట్లు చెప్పిన రాకేష్ కారు కాస్త ముందుకు వెళ్లగానే మంటలు చెలరేగాయని చెప్పాడు. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రేక్ పడలేదని తెలిపాడు. హ్యాండ్ బ్రేక్ వేసినప్పటికీ కూడా కారు ఆగకపోవడంతో వెంటనే బయటకు దూకేసినట్లు చెప్పాడు.

కారులోనుంచి దూకిన రాకేష్ వెంటనే పోలీసులకు, ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసినట్లు తెలిపాడు. పరుగెడుతున్న కారను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు ఆగలేదని చెప్పిన రాకేష్ ఎదురుగా రాంగ్ రూట్‌లో వస్తున్న ఆటోను ఢీకొంది.

ఘటన జరిగిన సమయంలో సహాయం చేయాల్సిందిగా కేకలు వేసినప్పటికీ అంతా వీడియోలు తీసే పనిలో నిమగ్నమయ్యారే తప్ప ఒక్కరు కూడా సహాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు రాకేష్. తను స్పృహ కోల్పోయే పరిస్థితి తలెత్తిందని తాగేందుకు కనీసం మంచి నీళ్లు కూడా ఎవరూ అందించలేకపోయారని చెప్పాడు.

English summary
An amateur video that captured dramatic scenes of a burning car being chased by a man on a Gurugram flyover went viral on the social media on Tuesday evening. Explaining the incident, police said Rakesh Chandel, 44, had gone to Sector 25 to distribute Diwali gifts on Tuesday and was returning home when the car he was driving suddenly caught fire. Chandel, an employee of a manpower firm in Manesar, had a narrow escape, police said.In the video, Chandel is seen running behind car before the vehicle hit an auto on the Rajeev Chowk flyover, towards Hero Honda Chowk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X