వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకల్ రైలులో చెలరేగిన మంటలు: ఉద్దేశపూరకమేనా? బ్యాగును విసిరేయడం వల్లే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

లోకల్ రైలులో చెలరేగిన మంటలు: ఉద్దేశపూరకమేనా? బ్యాగును విసిరేయడం వల్లే!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం కలకలం చెలరేగింది. ఓ లోకల్ రైలులో అగ్నిప్రమాదం సంభవించింది. ఓవర్ హెడ్ విద్యుత్ తీగల నుంచి లోకల్ రైలుకు కరెంట్ ను సరఫరా చేసే పాంటోగ్రాఫ్ వద్ద మంటలు చెలరేగాయి. ప్రయాణికులు సకాలంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్తి నష్టం వాటిల్లింది. ముంబైలోని వాషి రైల్వే స్టేషన్ లో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బోగీలో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. వారందరూ సకాలంలో తప్పించుకోగలిగారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగుఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగు

ఛత్రపతి శివాజీ టెర్మినస్...

ఛత్రపతి శివాజీ టెర్మినస్...

ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి పన్వెల్ వైపునకు వెళ్తోన్న లోకల్ రైలు హార్బర్ లైన్ లోని వాషి స్టేషన్ లో నిలిచిన వెంటనే పాంటోగ్రాఫ్ లో మంటలు చెలరేగాయి. మొదట తక్కువ మోతాదుల పొగ రావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రైలు కదలిని వెంటనే పాంటోగ్రాఫ్ నుంచి మంటలు వెలువడ్డాయి. పెద్దగా శబ్దం చేస్తూ విద్యుత్ తీగలు మంటల బారిన పడ్డాయి. దీన్ని గమినించిన వెంటనే ప్రయాణికులు చైన్ లాగారు. కిందికి దిగారు. ఓవర్ హెడ్ విద్యుత్ తీగలకు సరఫరా అవుతోన్న కరెంటును స్టేషన్ అధికారులు నిలిపి వేశారు. రైలు స్టేషన్ దాటి వెళ్లిన సమయంలో మంటలు చెలరేగి ఉంటే.. గాలి వేగానికి అవి మరింత ఉధృతం అయ్యేవని, పెను ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు.

 సెంట్రల్ రైల్వే అధికారులు ..

సెంట్రల్ రైల్వే అధికారులు ..

ఈ సమాచారం అందుకున్న వెంటనే సెంట్రల్ రైల్వే అధికారులు వాషి స్టేషన్ కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం సంభవించలేదని వెల్లడించారు. ఓవర్ హెడ్ లైన్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల హార్బర్ లైన్ లో ఇతర సబర్బన్ రైలు సర్వీసుల రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లు ఇతర స్టేషన్లలో నిలిచిపోయాయి. లోపాన్ని సరి చేసిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి గురైన ర్యాక్ ను వేరు చేసి రైలును పన్వెల్ పంపించారు. ఈ ఘటన వల్ల సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లు సమాచారం.

కుట్ర కోణం ఉందా?

కుట్ర కోణం ఉందా?

ఈ ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాంటోగ్రాఫ్ మీదికి బ్యాగును విసిరేయడం వల్లే మంటలు చెలరేగాయని సెంట్రల్ రైల్వే అధికారులు ధృవీకరించారు. మంటలు చెలరేగిన చోట.. ఓ బ్యాగు కాలి బూడిదైన ఆనవాళ్లు కనిపించాయని వెల్లడించారు. ఉద్దేశపూరకంగానే బ్యాగును విసిరేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సెంట్రల్ రైల్వే అధికారులు ఓ ట్వీట్ చేశారు. దీనిపై రైల్వే భద్రతా బలగాలు (ఆర్పీఎఫ్), జనరల్ పోలీసులు (జీఆర్పీ) పోలీసులు సంయుక్త దర్యాప్తు చేపట్టారు.

English summary
A local train in Mumbai caught fire on Wednesday morning, briefly disrupting services on the Harbour Line. Fire was reported at Vashi Station in a train travelling from Chhatrapati Shivaji Terminus to Panvel. No injuries were reported in the incident. The Central Railway said in a statement that minor flames were seen rising out of the train’s pantograph – an apparatus on the roof of an electric train, tram or electric bus to collect power through contact with an overhead line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X