వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేల కూలిన వాయుసేన ఎయిర్‌క్రాఫ్ట్ తొలి పిక్ ఇదే!

|
Google Oneindia TeluguNews

ఇటాన‌గ‌ర్‌: ఈ నెల 3వ తేదీన గ‌ల్లంతైన మ‌న‌దేశ వైమానిక ద‌ళానికి చెందిన ఆంటొనొవ్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ శ‌క‌లాలకు సంబంధించిన తొలి ఫొటో విడుద‌లైంది. ఆకాశ‌మార్గం నుంచి శ‌క‌లాల‌ను గుర్తించిన వెంట‌నే వైమానిక ద‌ళ వింగ్ క‌మాండర్లు ఈ ఫొటోను తీశారు. ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన శ‌క‌లాలు, దాని స‌మీపంలో మాడి మ‌సి అయిన ప‌చ్చని చెట్లు ఈ ఫొటోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

విమానం శకలాలను మంగళవారం మ‌ధ్యాహ్నం అరుణాచల్ ప్రదేశ్‌లోని షియాంగ్ జిల్లాలోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో పాయుమ్ ప్రాంతంలో వాయుసేన సిబ్బంది గుర్తించిన విష‌యం తెలిసిందే. ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ ప్ర‌మాదానికి గురైన ప్ర‌దేశం సముద్రమట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న‌ట్లు తేలింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తోన్న 13 మంది వైమానిక సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియ రాలేదు. వారి కోసం గాలింపు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తున్నారు వైమానిక ద‌ళ అధికారులు.

First Image Of Air Forces An-32 Crash Site Shows Debris, Charred Trees

ఈ నెల 3వ తేదీన అసోంలోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్ర‌దేశ్ స‌మీపంలో చైనా స‌రిహ‌ద్దుకు ఆనుకుని ఉన్న మెఛుకాలోని వైమానిక ద‌ళ బేస్ క్యాంపున‌కు బ‌య‌లుదేరిన ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ మార్గ‌మ‌ధ్య‌లో గల్లంతయిన విష‌యం తెలిసిందే. దీని ఆచూకీని కనుగొనడానికి వాయుసేనకు చెందిన సుఖోయ్-30, ఎంఐ-17 యుద్ధ విమానాలతోపాటు సైనికులు, అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇస్రో సహాయాన్ని కూడా తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. దాని జాడ కాన‌రాలేదు.

First Image Of Air Forces An-32 Crash Site Shows Debris, Charred Trees

మంగళవారం గాలింపు సందర్భంగా ఎంఐ-17 విమానంలోని అధికారులు ఏఎన్-32 శకలాలను పాయుమ్ వ‌ద్ద గుర్తించారు.జోర్హట్ నుంచి బయలుదేరే స‌మ‌యంలో ఇందులో మొత్తం 13 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ లభించట్లేదు. వారంద‌రూ మ‌ర‌ణించి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు.

English summary
The wreckage of an An-32 aircraft that went missing with 13 on board last week was found in Arunachal Pradesh on Tuesday after eight days of intense search by the Indian Air Force. The first image of the crash site, taken directly from above and shared by sources, shows debris from the aircraft and charred trees, indicating a big fire when the plane would have gone down. The wreckage was found in Payum Circle of Siang district. It was spotted by a Mi-17 helicopter of the Indian Air Force, at a height of around 12,000 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X