వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మస్ట్ రీడ్ : పురుషులకు తొలి గర్భనిరోధక ఇంజెక్షన్, భారత్‌లో తయారు..ఆమోదమే తరువాయి

|
Google Oneindia TeluguNews

గర్భం దాల్చకూడదు అనుకుంటే ఇప్పటి వరకు ట్యూబెక్టమీ లేదా వ్యాసెక్టమీ చేసేవారు. ఇది చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఎక్కువగా మహిళలే ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారనేది వాస్తవం. భవిష్యత్తులో పిల్లలు వద్దనుకుంటే ట్యూబెక్టమీనే ప్రిఫర్ చేస్తారు. దీంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఇక పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇది కూడా కుటుంబనియంత్రణలో భాగమే. వీటన్నిటికీ చెక్ పెడుతూ వ్యాసెక్టమీ స్థానంలో ఒక చిన్న ఇంజెక్షన్‌‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కనిపెట్టింది.

 పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్

పురుషులకు గర్భనిరోధక ఇంజెక్షన్

పురుషుడు స్త్రీతో లైంగికంగా కలిసినప్పుడే ఆ స్త్రీ గర్భం దాలుస్తుంది. ఇది సృష్టి ధర్మం. పిల్లలు చాలు అని అనుకున్నప్పుడు సాధారణంగా మహిళలు ట్యూబెక్టమీ చేయించుకుంటారు. కొన్ని సందర్భాల్లో పురుషుడు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటాడు. వ్యాసెక్టమీ ఆపరేషన్ స్థానంలో పురుషులకు ఒక గర్భనిరోధక ఇంజెక్షన్ ఇస్తే చాలు, వారు లైంగికంగా మరోమహిళతో కలిసినప్పుడు ఆమె గర్భం దాల్చదని చెబుతున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వైద్యులు. ఈ మేరకు వారు ఓ ఇంజెక్షన్‌ను కనిపెట్టారు. ఇది ప్రపంచంలోని తొలి గర్భనిరోధక ఇంజెక్షన్ అని చెబుతున్నారు.

సక్సెస్ రేట్ ఇచ్చిన గర్భనిరోధక ఇంజెక్షన్‌ ప్రయోగం

సక్సెస్ రేట్ ఇచ్చిన గర్భనిరోధక ఇంజెక్షన్‌ ప్రయోగం

గర్భనిరోధక ఇంజెక్షన్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఈ ప్రాజెక్టు అధినేత డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. ప్రస్తుతం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోద ముద్రకోసం పంపినట్లు శర్మ తెలిపారు. తాము 303 మంది పురుషులను ఈ ప్రయోగం కోసం నియమించుకున్నట్లు శర్మ తెలిపారు. ప్రయోగం తర్వాత 97.3శాతం సక్సెస్ రేటు రావడంతో పాటు ఇంజెక్షన్‌ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు కనిపించలేదని డాక్టర్ శర్మ తెలిపరు. మొత్తం 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు శర్మ వెల్లడించారు. ఒక్కసారి ఇంజెక్షన్ వేశామంటే 13 ఏళ్ల పాటు ఇది పనిచేస్తుందని వెల్లడించారు.

 గర్భనిరోధక ఇంజెక్షన్ కనిపెట్టడంలో తొలిదేశంగా భారత్

గర్భనిరోధక ఇంజెక్షన్ కనిపెట్టడంలో తొలిదేశంగా భారత్

ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనేది బయో మెడికల్ పరిశోధనలకు అత్యున్నత సంస్థ. ఈ సంస్థ కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తుంది. భారత ప్రభుత్వం ఈ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఇక గర్భనిరోధక ఇంజెక్షన్లపై అమెరికా కూడా ప్రయత్నాలు సాగిస్తుండగా ఇంకా అవి ప్రయోగం దశలోనే ఉన్నాయి. దీంతో పురుషుల్లో గర్భనిరోధక ఇంజెక్షన్ కనిపెట్టిన తొలిదేశంగా భారత్ నిలిచినట్లు అయ్యింది. అయితే డ్రగ్ కంట్రోలర్ నుంచి ఆమోదముద్ర పడగానే భారత్ ఇంజెక్షన్ కనిపెట్టిన తొలిదేశంగా నిలుస్తుంది.

2016లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన యూకే

2016లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించిన యూకే

పురుషుల్లో గర్భనిరోధక ఇంజెక్షన్‌పై ప్రయోగాలు 2016లో ప్రారంభమైనప్పటికీ అవి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనిషి మొటిమలు రావడం మానసిక స్థితిలో మార్పులు కనిపించడంతో ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు యూకే జాతీయ ఆరోగ్య సేవల శాఖ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. భారత్‌లో గర్భనిరోధం కోసం దంపతులు లైంగికంగా కలవకుండా దూరంగా ఉండటం, లేదా ఆపరేషన్‌లు చేయించుకోవడం చేస్తుంటారని ఇలా చేసేవారిలో దాదాపు 53.5శాతం మంది దంపతులున్నట్లు జాతీయ కుటుంబ సర్వే (2015-16) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 36శాతం మంది మహిళలు స్టెరిలైజేషన్ పద్ధతిని ఎంచుకుంటుండగా 0.3శాతం మంది పురుషులు వ్యాసెక్టమీని ఆశ్రయిస్తున్నారు.

 ఈ ఇంజెక్షన్ ఎక్కడ ఎలా ఇవ్వాలి..?

ఈ ఇంజెక్షన్ ఎక్కడ ఎలా ఇవ్వాలి..?

టెస్టికల్స్ దగ్గర వీర్యం ఉండే ట్యూబ్ దగ్గర ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని అయితే ఇది అనెస్తేషియా ఆధ్వర్యంలోనే జరగాలని వైద్యులు తెలిపారు. ఇందులోని పాలిమర్‌ను ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ ఎస్‌కే గుహ 1970లో కనిపెట్టారని శర్మ తెలిపారు. ఇక 1984 నుంచి ఈ పాలిమర్‌‌ను ఒక ఉత్పత్తిగా మలిచి పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రయత్నాలు కొనసాగాయని చివరకు ప్రాడక్ట్ సిద్ధమైపోయిందని డాక్టర్ శర్మ తెలిపారు. ఈ ఉత్పత్తిని రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడన్స్(RISUG) అని పిలుస్తారని దీని తయారీలో స్టిరీన్ మేలిక్ అన్‌హైడ్రైడ్ అనే కాంపౌండ్‌ను వినియోగించినట్లు తెలిపారు. ఇది ఒక్కసారి ఇంజెక్ట్ చేస్తే 13 ఏళ్ల పాటు పనిచేస్తుందని అది ఎలుకలపై ప్రయోగించామని అది సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పారు.

అవగాహన కల్పిస్తే భారత్‌లో మంచి ఫలితాలు

అవగాహన కల్పిస్తే భారత్‌లో మంచి ఫలితాలు


ఇక ఈ ఉత్పత్తిని విడుదల చేసేముందు చాలా అప్రూవల్స్ రావాల్సి ఉందని ఇందుకు ఏడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు డ్రగ్ కంట్రోలర్. ఎందుకంటే ఇలాంటి బృహత్తరమైన ప్రాడక్ట్ విడుదల చేసేముందు అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని పరిశీలనలు చేశాకే ఆమోద ముద్రవేస్తామని ఆయన చెప్పారు. ఇక గర్భనిరోధక ఇంజెక్షన్ వస్తే పురుషులు చాలా లాభపడతారని డాక్టర్లు నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్‌ కంటే ఇంజెక్షన్‌తోనే చాలా లాభాలు ఉంటాయని వెల్లడించారు. అయితే దీనిపై ప్రభుత్వం విస్తృత స్థాయిలో ప్రచారం అవగాహన కల్పిస్తే భారత్‌లాంటి దేశంలో సత్ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు.

English summary
The Indian Council of Medical Research (ICMR) has successfully completed clinical trials of the world’s first injectable male contraceptive, which has been sent to the Drug Controller General of India (DCGI) for approval, according to researchers involved in the project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X