వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదట నేను భారతీయుడిని.. ఆ తరువాతే ఇంకేదైనా: మీడియాకు ఇస్రో ఛైర్మన్ చురకలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇస్రో ఛైర్మన్ కే శివన్..పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు ఇది. చంద్రయాన్-2 మిషన్ తో దేశవ్యాప్తంగా..ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలానికి దిగడానికి కొన్ని క్షణాల ముందే అంతర్థానం కావడం, అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయిన ఆయనను స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్కున చేర్చుకుని ఓదార్చడం వంటి ఘటనలతో శివన్ పేరు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. జన్మత: శివన్ తమిళుడు. ఆయన పూర్తి పేరు కైలాసవడివూ శివన్. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధక కేంద్రానికి సారథ్యం వహిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ శివన్ తో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ మొత్తం దాదాపుగా తమిళంలో సాగింది. ఆ సమయంలో- సదరు న్యూస్ ఛానల్ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు శివన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇస్రో వంటి గొప్ప సంస్థకు ఓ తమిళుడు ఛైర్మన్ గా వ్యవహరిస్తుండటం గర్వించదగ్గ విషయమని, దీనిపై తమిళనాడు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారంటూ ఆ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు శివన్ కాస్త ఘాటుగా బదులు ఇచ్చారు. నేను మొదట భారతీయుడిని. ఆ తరువాతే ఇంకేదైనా. భారతీయుడినని చెప్పుకోవడానికే నేను మొగ్గు చూపుతాను. భారతీయుడిగానే ఇస్రోలో చేరాను. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని భాషలకు చెందిన వారు ఒకే చోట, సమష్టిగా పనిచేసే సంస్థ ఇస్రో. ఇలా భారతీయులందరితోనూ కలిసి పని చేయడం గర్వంగా ఉంది.. అని సమాధానం ఇచ్చారు.

‘First of all, I am an Indian’: ISRO chief Sivan wins hearts with his reply

దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. శివన్ భారతీయ తత్వాన్ని నెటిజన్లు, ట్విట్టరెట్టీలు స్వాగతిస్తున్నారు. శివన్ ఏ ఒక్క కులానికో లేక ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన శాస్త్రవేత్త కాదని అంటున్నారు. కులం, మతం, ప్రాంతం, రాష్ట్రాలకు అతీతుడని ప్రశంసిస్తున్నారు నెటిజనం.

English summary
Indian Space Research Organisation (ISRO) chief K Sivan melted hearts with his answers in a Sun TV interview. In a video-clip going viral on social media, the interviewer asks K Sivan that as a Tamil, having attained a big position, what does he want to say to the people of Tamil Nadu. The scientist replied, “First of all, I am an Indian, I joined ISRO as an Indian, and ISRO is a place where people from all regions and languages work and contribute,” He further added, “But I am grateful to my brothers who celebrate me.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X