కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha rape encounter:పులివెందులతో సీపీ సజ్జనార్ కు లింక్, ఆ నీళ్లు, ఆ జీతం !

|
Google Oneindia TeluguNews

కడప/పులివెందుల: దిశ హత్యాచారం దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేసిన సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ సొంతూర్లో ఎక్కడ చూసిన పండుగ వాతావరణం నెలకొంది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలో రోణా తాలుకాలోని అసుతి గ్రామంలో, విశ్వనాథ్ సజ్జనార్ విద్యాభ్యాసం పూర్తి చేసిన హుబ్బళి-దారవాడ జంట నగరాల్లో స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వనాథ్ సజ్జనార్ హుబ్బళిలోని ఇంటికి బంధు మిత్రులు, ఇతర గ్రామస్తులు పోటెత్తారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందలకు ఓలింక్ ఉంది. పులివెందుల నీళ్లు తాగిన పులిబిడ్డ సజ్జనార్ అంటూ పులివెందలలోని సజ్జనార్ కు బాగా పరిచయం ఉన్న చాల మంది పండుగ చేసుకుంటున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

సజ్జనార్ చెవిలో పులివెందుల పేరు వినిపించింది !

సజ్జనార్ చెవిలో పులివెందుల పేరు వినిపించింది !

1996లో విశ్వనాథ్ సజ్జనార్ యూపీఎస్ఇ పరీక్షలు రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా విశ్వనాథ్ సజ్జనార్ ఎంపిక అయ్యారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో విశ్వనాథ్ సజ్జనార్ తన ప్రతిభను కనపరిచారు. విశ్వనాథ్ సజ్జనార్ కు ఐపీఎస్ లో శిక్షణ ఇచ్చిన పోలీసు అధికారులకు ఆయన అంటే ఓ ప్రత్యేకమైన గురి ఉండేది. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విశ్వనాథ్ సజ్జనార్ చెవిలో ఓ రోజు పులివెందుల పేరు వినిపించింది.

 పులివెందులతో ఏంటి లింక్ !

పులివెందులతో ఏంటి లింక్ !

ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విశ్వనాథ్ సజ్జనార్ ఉద్యోగంలో జాయిన్ కావడానికి సిద్దం అయ్యారు. పై అధికారులు ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారు ? తాను ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి ? అంటూ విశ్వనాథ్ సజ్జనార్ కొన్ని రోజులు వేచి చూశారు. అప్పుడే పై పోలీసు అధికారుల నుంచి విశ్వనాథ్ సజ్జనార్ కు పిలుపు వచ్చింది. విశ్వనాథ్ సజ్జనార్ వెంటనే పై పోలీసు అధికారుల ముందు ప్రత్యక్షం అయ్యారు. విశ్వనాథ్ సజ్జనార్ చేతిలో అపాయిట్మెంట్ లెటర్ పెట్టిన పోలీసు అధికారులు వెంటనే ఉద్యోగంలో చేరాలని చెప్పారు. అంతే అపాయిట్మెంట్ లేటర్ చూసిన సజ్జనార్ కు తాను పులివెందులలో ఉద్యోగంలో చేరాలని అర్థం అయ్యింది.

 పులివెందుల నీళ్లు అలాంటివి !

పులివెందుల నీళ్లు అలాంటివి !

ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విశ్వనాథ్ సజ్జనార్ మొదటి ఉద్యోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పులివెందులలో. పులివెందులలో విశ్వనాథ్ సజ్జనార్ డీఎస్పీగా (డీవైఎస్పీ) ఉద్యోగంలో చేరారు. పులివెందులలోనే విశ్వనాథ్ సజ్జనార్ ఐపీఎస్ అధికారిగా మొదటి జీతం తీసుకున్నారు. పులివెందుల నీళ్లు తాగిన విశ్వనాథ్ సజ్జనార్ కు అక్కడి రాజకీయాలు బాగా ఒంటపట్టాయి. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు దగ్గర నుంచి చూసిన విశ్వనాథ్ సజ్జనార్ కు నేటి రాజకీయాలు పెద్దగా నేర్పించనవసరం లేదు.

 వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం

వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం

పులివెందులలో డీఎస్పీ (ట్రైనీ ఎస్పీ)గా పని చేసిన విశ్వనాథ్ సజ్జనార్ కు అక్కడే వైఎస్. రాజశేఖర్ రెడ్డి పరిచయం అయ్యారు. చిన్న వయసులో ఉద్యోగంలో చేరిన విశ్వనాథ్ సజ్జనార్ పనితీరును గమనించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం అప్పట్లో ఈయన మంచి పోలీసు అధికారి అవుతారు అని చాలాసార్లు ఆన్నారని వైఎస్ఆర్ సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.

 ఇంజనీరింగ్ అమ్మాయిల యాసిడ్ దాడి కేసు ఎన్ కౌంటర్ రోజు !

ఇంజనీరింగ్ అమ్మాయిల యాసిడ్ దాడి కేసు ఎన్ కౌంటర్ రోజు !

2008 డిసెంబర్ లో వరంగల్ లోని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిలు స్వప్నిక, ప్రణతీల మీద శ్రీనివాస్ అనే నిందితుడు అతని ముగ్గురు స్నేహితులతో కలిసి యాసిడ్ దాడి చేశాడు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిల మీద యాసిడ్ దాడి జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆ రోజు వరంగల్ జిల్లా ఎస్పీ ఇదే విశ్వనాథ్ సజ్జనార్. సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న పరిచయంతో విశ్వనాథ్ సజ్జనార్ ఏం జరిగిందో అనే పూర్తి వివరాలు అప్పటి సీఎం వైఎస్ఆర్ కు చెప్పారు. అంతే సీఎం వైఎస్ఆర్ తో చర్చించిన తరువాత విశ్వనాథ్ సజ్జనార్ పోలీస్ పవర్ చూపించారు. ఆ రోజు విశ్వనాథ్ సజ్జనార్ తీసుకున్న నిర్ణయంతో యాసిడ్ దాడి నిందితులు ఎన్ కౌంటర్ లో అంతం అయ్యారు. ఆ ఎన్ కౌంటర్ తరువాత ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ రాష్ట్రాల్లో నేటి వరకూ అంతటి క్రూరమైన యాసిడ్ దాడి ఒక్కటి జరగలేదు.

 పులివెందులలో ట్రైనింగ్ అంటే తమాషానా !

పులివెందులలో ట్రైనింగ్ అంటే తమాషానా !

ఫ్యాక్షన్ రాజకీయాలకు రాయలసీమ పుట్టినిల్లు అంటుంటారు మేధావులు. అలాంటి రాయలసీమలోని కడప జిల్లాలోని పులివెందులలో డీఎస్పీగా మొదటిసారి ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ సజ్జనార్ తరువాత అనేక ప్రాంతాల్లో సమర్థవంతమైన పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రోజు పోలీసు అధికారులకు నిజంగా విశ్వనాథ్ సజ్జనార్ సత్తా తెలుసు కాబంట్టే ఆయనకు పులివెందులలో మొదటి పోస్టింగ్ ఇచ్చారని ఈ రోజు అర్థం అయ్యింది, హుబ్బళి పులి బిడ్డకు పులివెందుల నీళ్లు బాగా ఒంటపట్టాయి కాబట్టే నేడు సమర్థవంతమైన పోలీసు అధికారి అయ్యారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఏమైనా రియల్ హీరో విశ్వనాథ్ సజ్జనార్ మొదటి జీతం తీసుకున్న రోజు నుంచి నేటి వరకు ఓ మంచి పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చకుంటూనే ఉన్నారు.

English summary
first posting of ips VC Sajjanar in pulivendula in kadapa district in Andhra Pradesh. Encounter Specialist Police Officer VC Sajjanar is from hubballi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X