gujarat assembly election results 2017 gujarat legislative assembly election gujarat election results 2017 gujarat assembly elections 2017 గుజరాత్ ఎన్నికల ఫలితాలు 2017
మొదటి ఫలితం: గుజరాత్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి ఇతనే
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో తొలి ఫలితం బిజెపినే వరించింది. ప్రస్తుతం విజయ్ రూపానీ మంత్రివర్గంలో మత్యశాఖ మంత్రి బాబుభాయ్ బొకిరియా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ నేత అర్జున్ మోద్వాడియాపై విజయం సాధించారు. ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం బీజేపీ అభ్యర్థినే వరించింది. బీజేపీ మత్యశాఖ మంత్రి బాబుభాయ్ బొకిరియా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ నేత అర్జున్ మోద్వాడియాపై విజయం సాధించారు. పోరుబందర్ స్థానంలో పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1,855 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

ఈ స్థానం ఫలితం అన్ని స్థానాల్లో కంటే ముందే వెలువడింది. అయితే గుజరాత్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. గుజరాత్లో బిజెపి విజయం వైపుకు దూసుకు వెళ్తున్నా కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో బిజెపిని దెబ్బకొట్టడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు.