వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ISRO: మారిన వేదిక..వాహకనౌక: శ్రీహరికోటను కాదని: జీశాట్ ప్రయోగం:.నింగిలోకి దూసుకెళ్లి.. !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. తన కొత్త ఏడాదిని విజయవంతంగా ఆరంభించింది. ఈ ఏడాది తొలిసారిగా ప్రయోగించిన జీశాట్-30 ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపించింది. నిర్దేశిత సమయానికి కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగింది. టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయోగించిన ఉపగ్రహం ఇది. ఈ ప్రయోగంలో ఓ చిన్న మార్పు చోటు చేసుకుంది.

ISRO: శ్రీహరికోటకు ఇస్రో గుడ్ బై చెబుతుందా? తమిళనాడులో మరో ప్రయోగ కేంద్రం..!ISRO: శ్రీహరికోటకు ఇస్రో గుడ్ బై చెబుతుందా? తమిళనాడులో మరో ప్రయోగ కేంద్రం..!

శ్రీహరికోట నుంచి కాకుండా..

శ్రీహరికోట నుంచి కాకుండా..

సాధారణంగా ఏ ఉపగ్రహన్నయినా నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించడం ఇస్రో అలవాటు. ఈ సారి జీశాట్-30 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి కాకుండా.. ఫ్రెంచ్ గుయానా నుంచి ప్రయోగించింది ఇస్రో. ఫ్రెంచ్ గుయానాలోని కౌరు ప్రయోగ కేంద్రం నుంచి ఈ తెల్లవారు జామున 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) కాకుండా అరియానె-5 అనే వాహకనౌకను ఉపయోగించింది.

ఫ్రెంచ్ టెలికం కంపెనీతో కలిసి..


ఫ్రెంచ్ టెలికం సంస్థ యుటెల్‌శాట్ ‌తో కలిసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన 38 నిమిషాల 25 సెకెన్ల తరువాత అరియానె-5 నౌక నుంచి విజయవంతంగా విడివడింది. జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్, ఫ్రెంచ్ గుయానా స్పేస్ స్టేషన్ సీఈఓ స్టెఫానె ఇజ్రాయెల్ వేర్వేరు ప్రకటనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

టెలికం వ్యవస్థను బలోపేతం..

టెలికం వ్యవస్థను బలోపేతం..

టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయోగించిన ఈ జీశాట్-30 ఉపగ్రహం బరువు 3,357 కేజీలు. ఇదివరకు ఇస్రో ప్రయోగించిన ఇన్‌శాట్/జీశాట్ ఉపగ్రహాల పరంపరలో చేపట్టిన ప్రయోగమే ఇది. 12 సీ, 12 కేయు బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్‌ను ఈ ఉపగ్రమానికి అమర్చారు. ఇప్పటికే అంతరిక్షం నుంచి సేవలను అందిస్తోన్న ఇన్‌శాట్-4ఎ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్ కాల పరిమితి ముగిసింది. దీనికి రీప్లేస్ చేయడానికి జీశాట్-30ని ప్రయోగించినట్లు శివన్ వెల్లడించారు.

15 సంవత్సరాలు ఢోకా లేనట్టే..

ఈ ప్రయోగం ద్వారా మరో 15 సంవత్సరాల పాటు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థకు ఎలాంటి ఢోకా ఉండబోదని శివన్ వెల్లడించారు. జీశాట్-30 వల్ల డీటీహెచ్, టెలివిజన్ అప్‌లింక్స్, వీశాట్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. పైగా- అత్యాధునిక ట్రాన్స్‌పాండర్లను అమర్చడం వల్ల మనదేశంతో పాటు గల్ఫ్, ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలపైనా దీని ప్రభావం ఉంటుంది. ఈ ప్రయోగానికి ఇస్రో తరఫున యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ పీ కున్హికృష్ణన్‌తో కూడిన ప్రతినిధుల బృందం ఫ్రెంచ్ గుయానాకు వెళ్లింది.

English summary
First space mission in 2020, India's telecommunication satellite, GSAT30 was successfully launched from onboard Ariane-5 flight at the Kourou launch base in French Guiana in the early hours of Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X