వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు: మూడు దశాభ్దాల్లో మొదటి సారి రామమందిరం శిల్పాల పనులకు బ్రేక్ !

|
Google Oneindia TeluguNews

లక్నో: అయోధ్యలో చారిత్రాత్మక రామమందిరం నిర్మాణం కోసం రాతి శిల్పాలు చెక్కిస్తున్న విశ్వహింధూ పరిషత్ (VHP) ఆపనులను తాత్కాలికంగా నిలిపివేసింది. 1990 నుంచి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం నిరంతరం రాతి శిల్పాలు చెక్కిస్తున్నారు. మూడు దశాభ్దాల్లో మొదటి సారి రాతి శిల్పాలు చెక్కించే పనికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీం కోర్టులో అయోధ్య తీర్పు వెలువడుతున్న సమయంలో రాతి శిల్పాలు చెక్కించే పనిని తాత్కాలికంగా నిలిపివేయాలని వీహెచ్ పీ నిర్ణయించింది.

ఆపరేషన్ కమల భయం, శివసేన ఎమ్మెల్యే సీఎం ? రిసార్టు రాజకీయాలు, పవార్ షరతులు !ఆపరేషన్ కమల భయం, శివసేన ఎమ్మెల్యే సీఎం ? రిసార్టు రాజకీయాలు, పవార్ షరతులు !

అయోధ్య తీర్పు

అయోధ్య తీర్పు

ఏన్నో దశాభ్దాలుగా నానుతున్న అయోధ్య తీర్పు త్వరలో వెలువడనుంది. సుప్రీం కోర్టు తీర్పు త్వరలో వెలువడుతున్న సమయంలో వీహెచ్ పీ రాతి శిల్పాలు చెక్కించే పనిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే సమయంలో రాతి శిల్పాలు చెక్కించే పనిని కొనసాగించడం అంత మంచిది కాదని వీహెచ్ పీ నేతలు నిర్ణయించారని తెలిసింది.

ఎప్పుడో చెప్పలేం !

ఎప్పుడో చెప్పలేం !

రామమందిరం నిర్మాణం కోసం రాతి శిల్పాలు చెక్కించే పనిని మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం, త్వరలో ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని, అంత వరకు శిల్పాలు చెక్కుతున్న నిపుణులు విశ్రాంతి తీసుకుంటారని, రాతి శిల్పాల పనులు ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయం రామజన్మభూమి న్యాస్ కమిటీ నిర్ణయిస్తుందని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి శరద్ శర్మా తెలిపారు.

ములాయం సింగ్ హయాంలో !

ములాయం సింగ్ హయాంలో !

ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామమందిరం నిర్మాణం కోసం రాతి శిల్పాలు చెక్కించే పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 1.25 లక్షల ఘణ అడుగుల రాతి శిల్పాలు చెక్కించామని వీహెచ్ పీ నేతలు తెలిపారు. ఇంకా రాతి శిల్పాలు చెక్కించే పని పూర్తి కాలేదని వీహెచ్ పీ నేతలు అంటున్నారు.

1992లో బాబ్రీ మసీదు !

1992లో బాబ్రీ మసీదు !

1992లో బాబ్రీ మసీదు ధ్వంసం అయిన సమయంలో సంఘ్ పరివార్ తో పాటు అనేక సంఘాల కార్యకలాపాలు ఆరు నెలల పాటు నిషేధించారు. తరువాత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రామమందిరం నిర్మాణం కోసం రాతి శిల్పాలు అధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్ కు తరలి వచ్చాయి.

మూడు దశాభ్దాల్లో మొదటి సారి !

మూడు దశాభ్దాల్లో మొదటి సారి !

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం గత మూడు దశాభ్దాలుగా నిరంతరం రాతి శిల్పాలు చెక్కించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే సుప్రీం కోర్టులో అయోధ్య తీర్పు వెలువడుతున్న సమయంలో ముందు జాగ్రత్త చర్యగా రాతి శిల్పాలు చెక్కించే పనిని తాత్కాలికంగా నిలిపివేశారు. మూడు దశాభ్దాల్లో మొదటి సారి రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న రాతి శిల్పులు చెక్కించే పనిని తాత్కాలికంగా నిలిపివేశారు.

అయోధ్య తీర్పుతో హై అలర్ట్ !

అయోధ్య తీర్పుతో హై అలర్ట్ !

సుప్రీం కోర్టులో అయోధ్య తీర్పు ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో సాయుధ బలగాలు మొహరిస్తున్నాయి. ఈ సమయంలో రామమందిరం నిర్మాణం కోసం రాతి శిల్పాలు చెక్కించే పనులు కొనసాగించడం అంత మంచిది కాదని వీహెచ్ పీ నేతులు తాత్కాలికంగా నిలిపివేశారని సమాచారం.

English summary
Ramamandir: First Time Since 1990, VHP (Vishwa Hindu Parishat) Stopped Stone Carving For Ram Temple At Ayodhya in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X