వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్ వాటర్ మెట్రో రైలు.. మనదేశంలో తొలిసారిగా.. ఎక్కడో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : మెట్రో రైలు పరుగులు ఇక కొత్త అనుభూతిని కలిగించనుంది. దేశంలోనే తొలిసారిగా అండర్ వాటర్ ట్రైన్ నడిపేలా కసరత్తు జరుగుతోంది. ఇండియాలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కోల్‌కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ గురువారం ప్రకటించారు.

కోల్‌కతా హుగ్లీ నది కింద ఇండియన్ ఫస్ట్ అండర్‌ వాటర్‌ మెట్రో రైలు నడుస్తుందని పేర్కొన్నారు పీయూష్. ఆ మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ఓ వీడియోను కూడా షేర్ చేశారు. అది ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో. అద్భుతమైన ఇంజనీరింగ్‌ ప్రతిభకు అదొక ఉదాహరణగా నిలుస్తోంది. భారతదేశంలో రైల్వే పురోగతికి ఇది చిహ్నమని కొనియాడారు. అండర్ వాటర్ మెట్రో సర్వీస్ తో కోల్‌కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు పీయూష్. ఇది దేశం గర్వపడే విషయం అని ఆయన ట్వీట్‌ చేశారు.

 first under water metro train in india at kolkata Piyush Goyal announced

కోల్‌కతాలో ప్రారంభం కానున్న ఈ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ కోల్‌కతా మెట్రో లైన్ - 2 (ఈస్ట్-వెస్ట్ మెట్రో) కిందకు వస్తుంది. దానికోసం దాదాపు 16 కిలోమీటర్లు మేర ప్రత్యేకంగా లైన్ వేయనున్నారు. రెండు దశల్లో ట్రాక్ పనులు జరగనున్నాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్‌ నుంచి సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్‌తో కలుపుతూ దాదాపు ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ వుంటుంది.

వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)వరద నీటిలో డ్యాన్సులు.. భయం లేకుండా ఫన్నీగా.. డేంజరే సుమీ (వీడియో)

మొదటి దశను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి తొలి అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. దాంతో ప్రయాణికులకు కాలం కలిసొస్తుందని.. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిస్తుందని లెక్కలేస్తున్నారు. దీనికోసం తవ్విన సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017 ఏప్రిల్ చివరలో ప్రారంభమయ్యాయి. అలా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు తయారుచేశారు. జర్మనీ నుంచి రచ్నా, ప్రేర్నా అనే రెండు టాప్ - ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు అంతా సవ్యంగా జరిగితే అండర్ వాటర్ మెట్రో రైలు కోల్‌కతా వాసులకు తొందర్లోనే అందుబాటులోకి వస్తుందన్నమాట.

English summary
Union Railway Minister Piyush Goyal, on Thursday announced for India’s first underwater train that will be operating under Kolkata’s Hooghly River. For this, he also shared a video released by Indian Railways, featuring Prime Minister Mr. Narendra Modi, that talks about the excellent engineering skills that have been used for the construction of the metro tunnels that are 520 metres long and about 30 metres deep.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X