వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతోన్న కశ్మీర్ డీడీసీ ఎన్నికల కౌంటింగ్.. ఖాతా తెరచిన గుప్కర్ అలయన్స్, జమ్ములో బీజేపీ లీడ్

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రియాసి జిల్లా తురొ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, జేకేఏపీ అభ్యర్థి అజాజ్ అహ్మద్ ఖాన్ ట్రయల్‌లో ఉన్నారు. ఇక్కడ ఎన్సీ మహ్మద్ ఆష్రఫ్ ఉన్నారు. అజాజ్ సోదరుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ మహోర్‌లో లీడ్‌లో ఉన్నారు. చాసానా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గులా బానో లీడ్‌లో ఉన్నారు.

పూంచ్ జిల్లా లాస్సానాలో కాంగ్రెస్ అభ్యర్థి రుక్సానా కౌసర్ లీడ్‌లో ఉన్నారు. బాల్వాల్ బ్రహ్మణలో బీజేపీ అభ్యర్థి బుషన్ కుమార్ లీడ్‌లో ఉన్నారు. అక్నూర్‌లో బీజేపీ అభ్యర్థి సార్దా బాహు లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్, ఎన్సీ అభ్యర్థులు ఒక్కో చోట లీడ్‌లో ఉన్నారు. జమ్ములో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

First Win for Gupkar Alliance; Early Trends Show BJP Leading in Jammu

జమ్ముకశ్మీర్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎనిమిది దశల్లో 25 రోజులు పోలింగ్ జరగగా.. 280 డీడీసీ సీట్ల కోసం 2 వేల 178 మంది బరిలో నిలిచారు. వీరి భవితవ్యం తేలనుంది. జిల్లాకు 14 సీట్ల లెక్కన 280 స్థానాలు ఉండగా.. నవంబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పోలింగ్ జరిగింది. 51 శాతం ఓటింగ్ జరగగా.. 57 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నిక ప్రశాంతంగా జరిగింది.

ఎన్నికల బరిలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సహా ఏడు పార్టీలు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ పేరుతో బరిలోకి దిగాయి. పీఏజీడీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. కూటమిపై బీజేపీ విమర్శలు చేయడంతో.. కాంగ్రెస్ అంటిముట్టగట్టుగానే ఉంటోంది. డీడీసీ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడో విభాగ ఎన్నికలు.. జమ్ము కశ్మీర్ విభజన తర్వాత తొలి సారి ఎన్నికలు జరుగుతున్నాయి.

English summary
Jammu and Kashmir Reasi district’s Thuroo constituency, three-time former MLA and JKAP candidate Ajaz Ahmed Khan is trailing NC’s Mohammad Ashraf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X