వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపల కోసం వల విసిరితే.. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ దొరికింది

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చేపల కోసం వల విసిరిన ఓ మత్స్యకారుడికి ఓ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ లభించింది. 40 సంవత్సరాల కిందటిది. దాని బరువు సుమారు 1500 కేజీలు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునంబం సమీపంలో అరేబియా తీర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నౌకా దళ అధికారులు దీన్ని తమ నావల్ యార్డుకు తరలించారు. తమ ల్యాబొరేటరీలో దాన్ని పరీక్షిస్తున్నారు. వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ది అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

న్యాస్ ట్రస్ట్ లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లకు చోటు: 65 శాతం రెడీ..: విశ్వహిందూ పరిషత్..!న్యాస్ ట్రస్ట్ లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లకు చోటు: 65 శాతం రెడీ..: విశ్వహిందూ పరిషత్..!

భౌగోళింకంగా అరేబియా సముద్రానికి చెందిన ఓ పాయ మునంబం వద్ద భూభాగం పైకి చొచ్చుకుని వచ్చినట్లు ఉంటాయి. అక్కడ లోతు తక్కువగా ఉంటుంది. మునంబం తీర ప్రాంతంలోని సునామీ కాలనీకి చెందిన మత్స్యకారులు ఆ ప్రదేశంలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటారు. స్థానిక మత్స్యాకారుడొకరు ఆదివారం చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వలను అమర్చి, వెనక్కి తిరిగి వచ్చాడు. మంగళవారం సాయంత్రం వలను వెలికి తీయడానికి వెళ్లగా.. అది బరువుగా కదిలింది. దాన్ని వెలికి తీయడం అతని వల్ల కాలేదు. తోటి మత్స్యకారులు, చేపల వేటలో వినియోగించే పరికరాల సహాయంతో వలను వెలికి తీసి చూడగా.. తుప్పు పట్టిన ఇంజిన్ కనిపించింది.

Fishermen find 40-year-old fighter aircraft engine off Munambam coast near Kochi in Kerala

వెంటనే అతను కోచి తీర ప్రాంత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు, తీర ప్రాంత రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ గా నిర్దారించారు. అనంతరం నౌకాదళ అధికారులు, నావల్ డాక్ యార్డ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీన్ని పరిశీలించిన నౌకాదళాధికారులు అది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినేనని నిర్దారించారు. వైమానిక దళాధికారులు వినియోగించే ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధిచినది, కనీసం 40 సంవత్సరాల కిందటిదని ప్రాథమికంగా ధృవీకరించారు.

Fishermen find 40-year-old fighter aircraft engine off Munambam coast near Kochi in Kerala

మరిన్ని పరీక్షల కోసం దాన్ని నావల్ డాక్ యార్డ్ ల్యాబొరేటరీకి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఇండియన్ కోస్ట్ గార్డ్ తీర ప్రాంత పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎం అష్రాఫ్ తెలిపారు. 40 సంవత్సాల కిందట ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ క్రమంగా మునంబం తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. దీనికి సంబంధించి నావల్ డాక్ యార్డ్ అధికారులు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. 40 సంవత్సరాల కిందట అలాంటి ఇంజిన్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లను వైమానిక దళంలో వినియోగించి ఉండొచ్చని చెప్పారు.

English summary
Fishermen from Kerala on Tuesday recovered an aircraft engine when it got caught in their fishing nets. The sea line boat used by the fishermen pulled in the aircraft engine in their fishing nets from the Arabian Sea, off the coast of Munambam in Ernakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X