వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fit India 2020: ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన విరాట్ కోహ్లీ...ప్రధాని మోడీతో ఆన్‌లైన్ ముచ్చట

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఫిట్‌ఇండియా 2020 మూవ్‌మెంట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న పలువురు క్రీడాప్రముఖలుతో క్రీడాకారులతో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడారు. ఫిట్‌నెస్‌ ఉండాలంటే ఆటలు బాగా ఆడాలని అది ఒకరు చెబితే రాదని మననుంచి రావాలని చెప్పాడు విరాట్ కోహ్లీ. ముందుగా ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని విరాట్ కోహ్లీ ప్రధానికి చెప్పారు. ఫిట్‌నెస్‌లో డైట్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని విరాట్ కోహ్లీ చెప్పాడు.

మారుతున్న కాలంలో ఫిట్‌నెస్ అనేది మరుగున పడుతోందని... ఇది మరిచామంటే అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రధాని మోడీతో చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక భోజనం సమయాలను కరెక్టుగా పాటించాలని విరాట్ కోహ్లీ చెప్పాడు.

Fit India 2020: PM Modi interacts with Indian Cricket Captain Virat Kohli and others on fitness

వెయిట్ లాస్ కోసం చాలామంది ఆహారానికి దూరమవుతున్నారని తద్వారా అనారోగ్యసమస్యలను కొని తెచ్చుకుంటారని చెప్పాడు. మారుతున్న కాలనికి అనుగుణంగా క్రీడా సంస్కృతి కూడా మారుతూ వస్తోందని చెప్పిన విరాట్... ఒకప్పుడు నైపుణ్యం బాగుండేదని కాని ఫిట్‌నెస్ ఉండేదని ఆ స్థాయిలో ఉండేది కాదని చెప్పాడు. అయితే తన జట్టు మొత్తం ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించిందని విరాట్ చెప్పాడు.

ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు, క్రీడాకారులతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రధాని మోడీ మాట్లాడారు. విరాట్ కోహ్లీతో పాటు నటుడు, మోడల్ అయిన మిలింద్ సోమన్‌తో కూడా మాట్లాడారు. అదే సమయంలో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్‌తో ఆహారపు అలవాట్లు,ఆరోగ్యకరమైన జీవితానికి కావాల్సిన డైట్ గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ.

భారత్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్న మంచి ఉద్దేశంతో ప్రధాని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ ప్రజలంతా ఫిట్‌నెస్ పాటించాలని కోరుతూ ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌లో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. భారత్‌లో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభించి ఏడాది గడిచిన నేపథ్యంలో ప్రముఖ క్రీడాకారులను ఆన్‌లైన్ ద్వారా ప్రధాని పలకరించారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi interacted with fitness experts and influencers from across the country to mark the one-year anniversary of Fit India Movement on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X