• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్లిప్పర్స్‌లో బ్లూటూత్ డివైజ్... పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌‌ కోసం... ఐదుగురి అరెస్ట్...

|

రాజస్తాన్‌లో హైటెక్ కాపీయింగ్‌కి యత్నించబోయిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం(సెప్టెంబర్ 26) రాజస్తాన్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(REET-2021) నిర్వహించారు. ఈ పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌కి పాల్పడేలా ముగ్గురు అభ్యర్థులు సమాయత్తమయ్యారు. పరీక్షకు కొద్ది గంటల ముందు ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆ ముగ్గురితో పాటు వారికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బికనీర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాళ్లకు ధరించే స్లిప్పర్స్‌లో బ్లూ టూత్ డివైజ్‌లు అమర్చి... వాటి ద్వారా కాపీయింగ్‌కి పాల్పడేందుకు అభ్యర్థులు సిద్ధమైనట్లు అధికారులు గుర్తించారు. పరీక్షకు ముందే అధికారులకు దీన్ని గుర్తించడంతో హైటెక్ కాపీయింగ్‌కి చెక్ పెట్టినట్లయింది.దీనిపై బికనీర్ ఎస్పీ ప్రీతి చంద్ర మాట్లాడుతూ... నిందితుల్లో ఇద్దరిని మదన్‌లాల్,త్రిలోక్‌చంద్‌లుగా గుర్తించామని చెప్పారు. ఈ ఇద్దరు రీట్‌కు హాజరయ్యే తమ ముగ్గురు బంధువుల కోసం స్లిప్పర్స్‌లో బ్లూటూత్‌లు అమర్చి ఇచ్చారని తెలిపారు.

five arrested for allegedly cheat in exam with bluetooth devices in slippers

పరీక్షకు ముందు గగన్‌షాపూర్ బస్ స్టాండ్ వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బస్ స్టాండ్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో స్లిప్పర్స్‌లో బ్లూటూత్‌లు గుర్తించామన్నారు. బ్లూటూత్ అమర్చిన స్లిప్పర్స్ కోసం అభ్యర్థులు రూ.6లక్షలు చెల్లించినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.రీట్ పరీక్షలో కాపీయింగ్‌కి యత్నించబోయిన మరో ఏడుగురిని సైతం మరో ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

రీట్ పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఎక్కడా కాపీయింగ్,చీటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలు ఉన్న పట్టణాల్లో మొబైల్ ఇంటర్నెట్,బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేశారు. అయినప్పటికీ కొంతమంది హైటెక్ పద్దతుల్లో కాపీయింగ్‌కి యత్నించబోయి పట్టుబడ్డారు. మొత్తం 333 జిల్లాల్లో 3993 పరీక్షా కేంద్రాల్లో రీట్‌ను నిర్వహించారు.

రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో‌నూ ఇదే తరహా హైటెక్‌ కాపీయింగ్ వెలుగుచూసింది. వాయుసేన ఎయిర్‌మెన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌కి పాల్పడుతూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. హర్యానాకు చెందిన సౌరభ్‌ అనే యువకుడు సరూర్‌నగర్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో గల ఎస్‌ఈజెడ్‌ పరీక్షా సెంటర్‌లో ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా చెవికి రిసీవర్, బనియన్‌కు ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చుకున్నాడు. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయంతో పరీక్ష రాసేందుకు ప్రయత్నించాడు.

  IPL 2021 : Kumble బాధ వినుమా.. PBKS కి ఎప్పుడూ లాటరీనే ! || Oneindia Telugu

  అయితే సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్న పరీక్షా కేంద్రం సిబ్బందికి.. సౌరభ్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దాంతో ఇన్విజిలేటర్లు అతన్ని చెక్ చేశారు. చెవికి రిసీవర్‌ , బనియన్‌కు ఎలక్ట్రానిక్‌ డివైస్‌ అమర్చి ఎగ్జామ్స్‌ రాస్తున్న విషయాన్ని గమనించి రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. హర్యాణా నుంచి మిత్రుల సహాకారంతో సౌరభ్‌ పరీక్ష రాస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అధికారులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  English summary
  bluetooth in slippers-Police have arrested three people for attempting high-tech mass copying in Rajasthan. Two other accomplices were also arrested. The Rajasthan Teacher Eligibility Test (REET-2021) was conducted across the state on Sunday (September 26). Three candidates were ready to commit high-tech copying in this exam. Authorities discovered the matter a few hours before the test and arrested the trio and two of their accomplices.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X