వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలను తిరిగి తెరిపించేలా లైన్ క్లియరైంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. యూరియా దిగుమతులను తగ్గించే క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాలను తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటి పునరుద్ధరణకు 37 వేల 971 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రకటించారు.

అహా నా పెళ్లంట.. ప్లాస్టిక్ లేదంట.. అతిథులకు ఆనాటి మర్యాదలు గ్రేటంటఅహా నా పెళ్లంట.. ప్లాస్టిక్ లేదంట.. అతిథులకు ఆనాటి మర్యాదలు గ్రేటంట

five closed fertiliser plants being revived with 37,971 crore rupees

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా కేంద్రమంత్రి సదానంద గౌడ.. ఎరువుల అంశంపై మాట్లాడారు. దేశంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 305 మెట్రిక్ లక్షల టన్నుల యూరియా అవసరముండగా 241 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని చెప్పుకొచ్చారు. మిగతాదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని వెల్లడించారు.

ఆ క్రమంలో విదేశాల నుంచి యూరియా దిగుమతులు తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులోభాగంగానే ఐదు రాష్ట్రాల్లో మూతపడ్డ ఎరువుల కార్మాగారాలను తిరిగి తెరిపించనున్నట్లు పేర్కొన్నారు. వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం త్వరలోనే నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.

English summary
Five closed fertiliser plants are being revived at an estimated cost of Rs 37,971 crore as the government looks to reduce urea imports, Union minister D V Sadananda Gowda said Tuesday In Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X