వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉజ్జయిని కుంభమేళాలో విషాదం: 5గురు మృతి, 30 మందికి గాయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భోపాల్: ఉజ్జయిని కుంభమేళాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందగా 30 మంది వరకు గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణంతోనే తొక్కసలాట చోటు చేసుకుంది.

ఏప్రిల్ 22న ప్రారంభమైన ఈ కుంభమేళాకు లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగిందని కంభమేళా అధికారులు తెలిపారు. దీంతో తాత్కాలికంగా వేసిన డేరాలు కుప్పకూలాయాని తెలిపారు.

Five dead, 30 injured after heavy rain at Ujjain Kumbh Mela ground

అనుకోకుండా ఈ సంఘనట జరగడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాపై ఈరోజు ఉదయాన్నే ప్రధాని నరేంద్రమోడీ కూడా స్పందించారు. ఇప్పుడు ఈ సంఘటన జరగడం బాధాకరమని అన్నారు.

నెల రోజులు పాటు జరిగే ఈ కుంభమేళాకు రోజుకూ 3 నుంచి 7 లక్షల వరకు భక్తులు హాజరవుతున్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. ఉజ్జయిని అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

English summary
Five dead, 30 injured after heavy rain at Ujjain Kumbh Mela ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X