వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డానిష్ టూరిస్టుపై గ్యాంగ్‌రేప్: ఐదుగుర్ని దోషులుగా తేల్చిన కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డెన్మార్క్‌కి చెందిన పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు ఐదుగురు వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. 2014లో ఢిల్లీలో డెన్మార్క్‌కి చెందిన 52ఏళ్ల మహిళను కిడ్నాప్‌ చేసి ఆమె వద్ద ఉన్న డబ్బు దోచుకోవడమే గాక ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు దోషులను నిర్ధారించింది.

వారికి విధించాల్సిన శిక్షపై జూన్‌ 9న వాదనలు వింటామని కోర్టు వెల్లడించింది. దోషులు మహేంద్ర అలియాస్‌ గంజా(27), మహద్‌ రాజా(23), రాజు(24), అర్జున్‌(22), రాజు చక్కా(23). కాగా, మరో నిందితుడు 56ఏళ్ల శ్యామ్‌ లాల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరణించాడు.

delhi

ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు జువెనైల్స్‌ కాగా వారిపై జువెనైల్‌ జస్టిస్‌ బోర్డులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ 27 మంది సాక్షులను విచారించింది.

తండ్రి ఆఫీసులోనే కూతురుపై రేప్

ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలోని ఓ కార్యాలయంలో యజమాని కూతురు(7)పై ఓ పెయింటర్(35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్ట్ చేసి కోర్టులో హజరుపర్చారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది.

English summary
A court in Delhi convicted five men on Monday for the gang-rape of a 52-year-old Danish tourist in 2014.The five were found guilty of the rape, kidnapping, and robbery of the Danish woman, who was attacked at knife-point after losing her way while returning to her hotel in central Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X