వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య కేసు: సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును గురువారం ఐదురుగు సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ ధర్మాసనం సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పాటైంది. ఇక జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు ధర్మాసనంలో సభ్యులుగా ఉంటారు.

విచారణలో భాగంగా తొలుత కేసుకు సంబంధించిన మూలాంశాలను పరిశీలించి దాన్ని రోజువారి క్రమంలో విచారణ చేయాలా లేదా అనేదానిపై బెంచ్ నిర్ణయించనుంది. ఇదిలా ఉంటే అధికార బీజేపీ పార్టీతో పాటు మద్దతు పార్టీలు, ఇతర హిందూ సంఘాలు అయోధ్యలో రామమందిరం నిర్మాణం లోక్‌సభ ఎన్నికలు జరగకముందే ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Five-member SC constitution bench begins hearing Ayodhya title suit

ఇదిలా ఉంటే త్వరతగతిన కేసును విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు గతేడాది తిరస్కరించింది. కేసు విచారణ వేగవంతం చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇందుకు న్యాయస్థానం తిరస్కరిస్తూ సుప్రీంకోర్టుకు ఏ కేసు ఎప్పుడు విచారణ చేయాలో తెలుసని ఒకరు చెప్పాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. ప్రతిరోజు కేసును విచారణ చేయాలా లేక సమయం తీసుకుని విచారణ చేయాలా అన్నదానిపై కోర్టు ఈరోజు స్పష్టత ఇవ్వనుంది.

ఇక రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణం చేయాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్థలం కూడా రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉండటం వల్ల ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందని పలువురు ప్రముఖలు భావిస్తున్నారు. అంతకుముందు అదే చోట ఉన్న 16వ శతాబ్దం నాటి బ్రాబీ మసీదును 1992లో ఓ హిందూ సంఘానికి చెందిన కార్యకర్తలు కూల్చివేశారు. ఇక ఆనాటి నుంచి నేటి వరకు అక్కడ పరిస్థితి చాలా సున్నితంగా తయారైంది.

English summary
A five-judge bench of the Supreme Court, headed by Chief Justice of India Ranjan Gogoi, will hear the contentious Ram Janmabhoomi-Babri Masjid case today.The other four judges on the bench are Justice SA Bobde, Justice NV Ramana, Justice UU Lalit and Justice DY Chandrachud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X