చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11 ఏళ్ల బధిర బాలికపై ఏడాదికాలంగా గ్యాంగ్‌రేప్: ఆ ముగ్గురూ చచ్చే వరకూ జైళ్లోనే: 15 దోషులుగా..!

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11 సంవత్సరాల బధిర బాలికపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసులో చెన్నై ప్రత్యేక న్యాయస్థానం 15 మందికి శిక్ష ఖరారు చేసింది. ఈ సామూహిక అత్యాచారంలో ప్రమేయం ఉన్నవారందరినీ దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 17 మంది దోషులుగా తేలగా.. ఒకరు అనారోగ్యానికి గురై మరణించాడు. మరొకరు నిర్దోషిగా బయట పడ్డాడు. దోషులుగా తేలిన వారిలో అయిదుమందికి ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ప్రధాన దోషులుగా గుర్తించిన ముగ్గురికి మరణించేంత వరకూ జైలులోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. మిగిలిన వారికి అయిదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

ఎవరెవరికి ఎలాంటి శిక్ష..

ఎవరెవరికి ఎలాంటి శిక్ష..

ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ మంజుల సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రధాన నిందితుడు లిఫ్ట్ ఆపరేటర్ రవికుమార్‌, సురేష్, పళనిలను వారు మరణించేంత వరకూ జైలులోనే ఉంచాలని తీర్పు వెల్లడించారు. రాజశేఖర్, అభిషేక్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇదే కేసులో అరుల్ బ్రాస్ అనే వ్యక్తికి ఏడేళ్ల శిక్ష పడింది. సుకుమార్, మురుగేశన్, పరమశివం, జయగణేష్, దీన దయాళన్, జయరామన్, సూర్య, రాజా, ఉమాపతిలకు అయిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఇదే కేసులో దోషిగా తేలిన మరో లిఫ్ట:్ ఆపరేటర్ బాబు.. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే అనారోగ్యానికి గురై మరణించాడు.

బధిర బాలికపై

బధిర బాలికపై


చెన్నైలోని అయనవరం ప్రాంతంలో గల సయాని అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం గత ఏడాది జులైలో వెలుగులోకి వచ్చింది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోన్న బాలికను బెదిరించి, 17 మంది ఏడాదికాలం పాటు అత్యాచారం చేస్తూ వచ్చారు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో అదే అపార్ట్‌మెంట్‌లో పనిచేసే లిఫ్టు ఆపరేటర్లు, ప్లంబర్లు, గార్డెనర్లు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. లిఫ్ట్ ఆపరేటర్ రవికుమార్ ఈ కేసులో ప్రధాన దోషిగా తేలాడు. రవికుమార్ సమాచారం ఇవ్వడం వల్లే మిగిలిన వారంతా ఆ బాలికపై తరచూ అత్యాచారానికి పాల్పడుతుండే వారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల గుణశేఖరన్ అనే గార్డెనర్ నిర్దోషిగా బయటపడ్డాడు.

మరింత కఠిన శిక్షలు విధించాలి..

మరింత కఠిన శిక్షలు విధించాలి..

దోషులకు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, మరింత కఠిన శిక్షలను విధించాల్సిన అవసరం ఉందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ రమేష్ అన్నారు. న్యాయమూర్తి జస్టిస్ మంజుల తీర్పు వెలువడించిన తీర్పును ఆయన స్వాగతించారు. అయినప్పటికీ.. మరింత కఠిన శిక్ష పడుతుందని తాను ఆశించినట్లు చెప్పారు. మరింత కఠినశిక్ష పడేలా చేయడానికి హైకోర్టులో అప్పీల్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం తాను న్యాయ, హోం మంత్రిత్వ శాఖ అధికారులను సంప్రదిస్తానని అన్నారు. ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన అప్సరా రెడ్డి తీర్పును స్వాగతించారు.

English summary
Five out of 15 men convicted in the rape and assault of a 11-year-old child in Chennai were sentenced to life on Monday by a special Protection of Children from Sexual Offences (POCSO) court in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X