వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.175 కోట్ల విలువ గల 35 కిలోల డ్రగ్స్ సీజ్, తీరం గుండా దేశంలోకి రవాణా, గస్తీ కాసి పట్టుకున్న ఏటీఎస్

|
Google Oneindia TeluguNews

తీరం గుండా భారతదేశంలోకి భారీగా డ్రగ్స్ తరలిచేందుకు పాకిస్థాన్‌కు చెందిన కొందరు ప్రయత్నించారు. పక్కా సమాచారంతో గుజరాత్ తీరం వద్ద పాకిస్థాన్‌కి చెందిన బోటును ఆంటీ టెర్రరిజం స్కాడ్, గుజరాత్ పోలీసులు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా పట్టుకున్నారు. భారత జలాల్లోకి బోటు ప్రవేశించిన తర్వాత ముట్టడించి, బోటును స్వాధీనం చేసుకున్నారు.

35 కిలోల డ్రగ్స్

35 కిలోల డ్రగ్స్

బోటులో తనిఖీ చేపట్టగా భారీగా మత్తు పదార్థాలు కనిపించాయి. ఇందులో నార్కొటిక్ డ్రగ్స్, హెరాయిన్ ఉన్నాయి. బోటులో ఉన్న అనీస్ ఐసా భట్టి (30), ఇస్మాయిల్ మహమద్ కచ్చీ (50), ఆస్రఫ్ ఉస్మాన్ కచ్చీ (42), కరీమ్ అబ్దులా కచ్చీ (37), అబుబకార్ అస్రఫ్ సుమ్రా (55)ను డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 35 కిలోల డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.175 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

సమాచారంతో

సమాచారంతో

పాకిస్తాన్ నుంచి కొందరు అక్రమంగా డ్రగ్స్ తీసుకొస్తున్నారని ఏటీఎస్‌కు సమాచారం వచ్చింది. దీంతో కోస్ట్ గార్డు, పోలీసులతో సమన్వయం చేసుకొని తీరం వెంబడి గస్తీ కాశారు. కచ్ వద్దగల జకౌవ్ వద్ద నిరిక్షీంచారు. వాయవ్య దిశగా జకౌవ్‌కు పాకిస్తాన్‌కు చెందిన జామ్ జామ్ బోటు వచ్చింది. భారత జలాల్లోకి బోటు రావడంతో ఐబీఎస్, మెరైన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బోటును ముట్టడించి ప్రణాళిక ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.

 విచారణ

విచారణ

బోటును పరిశీలించగా అందులో భారీగా మత్తు పదార్థాలు ఉన్నాయి. 35 కిలోల డ్రగ్స్‌ను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్లలో ఉంటుందని చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు పాకిస్తానీలను విచారిస్తున్నారు. డ్రగ్స్ ఇప్పుడేనా..? గతంలో ఏమైనా తీసుకొచ్చారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

English summary
Anti Terrorism Squad of Gujarat Police in a joint operation with the Indian Coast Guard apprehended five Pakistan nationals on Monday with heroin worth Rs 175 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X