వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నై ఆస్పత్రిలో దారుణం .. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతి || Oneindia Telugu

తమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో ఉన్న రాజాజీ గవర్నమెంట్ ఆసుపత్రిలో జరిగిన ఈసంఘటన ఐదు కుటుంబాల్లో విషాదం నింపింది. దీంతో ఆస్పత్రిలోని రోగులు వెంటిలేటర్లు పని చేయ్యకపోవటమే కారణం అని ఆస్పత్రి సిబ్బందిపై , ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం రాత్రి చెన్నైలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రాజాజీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోని విద్యుత్ పరికరాలు పనిచేయడం మానేశాయి. అయితే, ఆసుపత్రిలో జనరేటర్ కూడా పనిచేయకపోవడంతో ఐసీయూలోని వెంటిలేటర్లకు సరఫరా నిలిచిపోయిందనేది మృతుల తరపు బంధువుల, ఆస్పత్రిలోని రోగుల వాదన . ఫలితంగా అందులో చికిత్స పొందుతున్న ఐదుగురు మృతి చెందినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. మదురై సమీపంలోని శ్రీవిల్లి పుత్తూరు గ్రామానికి చెందిన రవీంద్రన్ (52), మల్లిగ (58), ఒడ్డంచత్రంలోని పలణియమ్మల్ (60), ఒడ్డంచత్రంలోని, సెల్లైతై (55) మదురైకు చెందిన , అర్ముఘం (54) మరణించారు.

Five patients died during power outage at Government Rajaji Hospital in madurai

అయితే, జనరేటర్ పనిచేయకపోయినా బ్యాటరీల ద్వారా వెంటిలేటర్లకు పవర్ సప్లై అయిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.రోగులు పవర్ కట్ కారణంగా చనిపోలేదని, పరిస్థితి విషమించే చనిపోయారని ఆసుపత్రి డీన్ వనతి చెప్తున్నారు. కానీ వెంటిలేటర్ మీద ఉన్న ఐదుగురు ఒకేసారి చనిపోవటం వెంటిలేటర్లు పని చెయ్యలేదు అన్న సంకేతాలు ఇస్తున్నాయి.

English summary
As many as five patients who were on life support in an Intensive Care Unit of the Government Rajaji Hospital in Madurai died during a power outage following rain and thunderstorms on Tuesday evening. The deceased were identified as G Ravindran (52) of Srivilliputhur, M Malliga(58) of a village near Madurai, P Palaniammal (60) of Oddanchathram, Sellathai P Palaniammal (60) of Oddanchathram, Sellathai (55) of Madurai and Arumugham (54) of Udumalaipettai. Their relatives said that the deaths were caused by suffocate following lack of oxygen supply when the hospital faced powed power outage. The ventilators didn't function during the outage from 6:30 pm till 7:15 pm as the generator was not in working condition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X