వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడికి వెళ్లారు: చెరువులో మునిగి ఐదు మంది జలసమాధి, ముగ్గరు అమ్మాయిలు మృతి !

దేవాలయంలో పూజలు చెయ్యడానికి వెళ్లారుచెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన అమ్మాయిలు, అబ్బాయిలుఐదు మంది జలసమాధి, వర్షాలకు చెరువు నిండిపోయింది, విషాదం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన ఐదు మంది జలసమాధి అయిన ఘటన కర్ణాటకలోని కోప్పళ జిల్లాలో జరిగింది. కోప్పళ జిల్లా గంగావతి తాలుకాలోని హోమగుడ్డ గ్రామంలోని చెరువులో నీట మునిగి ముగ్గురు అమ్మాయిలతో ఐదు మంది జలసమాధి అయ్యారు.

హోమగుడ్గ గ్రామంలోని ప్రసిద్ది చెందిన శ్రీ దుర్గా పరమేశ్వరి దేవాలయంలో పూజలు చెయ్యడానికి రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం వెళ్లారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత సమీపంలోని చెరువు దగ్గరకు వెళ్లారు.

Five people drawn in Gangavathi lake in Karnataka.

ఆ సందర్బంలో రాఘవేంద్ర (20), పవిత్రా (17), పావని (12), ఆశిస్ (14), పౌర్ణికా అలియాస్ పౌర్ణిమా అనే ఐదు మంది నీట మునిగిపోయారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. స్థానికులు చెరువులో పిల్లల కోసం గాలించారు. భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో ఐదు మంది నీట మునిగి జలసమాధి అయ్యారు.

సోమవారం గజ ఈతగాళ్లు ఐదు మంది మృతదేహాలను బయటకు తీశారు. పిల్లల మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో పూజలు చెయ్యడానికి వీరు హైదరాబాద్ నుంచి వచ్చారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
Five people drawn in Gangavathi lake in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X