వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ గ్యాంగ్‌రేప్: ''నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి''

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీసు ఉన్నతాధికారి కూతురిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీసు ఉన్నతాధికారి కూతురిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తనపై అత్యాచారం జరిగిందని నిందితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది.

అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటకాలు ఆడుతున్నావా అంటూ హేళన చేశారు. ఈ ఘటనతో పోలీసుల తీరు పలు విమర్శలకు దారితీసింది.దీంతో ప్రభుత్వం బాధ్యులైన ఐదుగురు పోలీసులపై చర్యలు తీసుకొంది.

Five police officers suspended for Bhopal gang-rape

ఇదిలా ఉంటే బాధితురాలు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. వాళ్లకు భూమ్మీద జీవించే హక్కు లేదు. అటువంటి వాళ్లను నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీయాలని బాధితురాలు డిమాండ్ చేశారు. అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి ఎటువంటి అర్హత లేదని భోపాల్‌ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలు అభిప్రాయపడ్డారు.

సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థినిపై మంగళవారం నాడు నలుగురు యువకులు మూడు గంటలపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి దగ్గరలోనే హబీబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉన్న పోలీసులు బాధితురాలిని కాపాడలేకపోయారు. తనను కిడ్నాప్‌ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తాను పోలీస్‌ అధికారి కుమార్తెను అని చెప్పకపోయి ఉంటే.. అత్యాచారం తరువాత తనను హత్యచేసేవారని ఆమె చెప్పారు. హబీబ్‌గంజ్‌ పోలీస్‌ అధికారుల ప్రవర్తన అత్యంత హేయంగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసు విషయం‍లో అలసత్వం ప్రదర్శించిన 5 మంది పోలీసులను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. అంతేకాక ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

English summary
Five police officers were on Friday suspended in Madhya Pradesh for the alleged gang rape of a 19-year-old daughter of a police couple in the state capital on Tuesday, a senior police officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X