వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: ముంబైలో కూలిన ఐదంతస్తులు భవనం

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో ఐదు అంతస్తుల భవనం కూలింది. మంగళవారం మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఈ భవనం కూలింది. ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవనం కూలిందన్న సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, బీఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే రెస్క్యూ వ్యాన్ అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

ప్రస్తుతం ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఒక ఫ్లోర్‌లో మెట్లు కూలడంతో ఆ ప్రభావం ఇతర ఫ్లోర్‌లపై కూడా పడిందని అధికారులు తెలిపారు. నిచ్చెన సహాయంతో లోపల చిక్కుకున్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ముంబై ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది తెలిపారు.

Five-storey building collapses in Mumbai, one casuality reported

ఫైర్ బ్రిగేడ్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ భవంతి ఐదంతస్తులు ఉందని, పక్కనే మరో భవంతి కూడా ఉందని తెలిపారు. ఇది ఖార్ జింఖానా ప్రాంతంలోని 17వ నెంబర్ రోడ్డులో ఉన్నట్లు చెప్పారు. భవంతి కూలడంలో దాని తీవ్రతను సాధారణంగా 1 నుంచి 5 మధ్య లెక్కిస్తారు. అయితే ఖార్ జింఖానాలో కూలిన భవనం తీవ్రత 3గా ఉంటుందని ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే భవంతి కూలడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉందని దానిపై విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

English summary
On Tuesday, a portion of a five-storey building located on the 17th road in Khar, located in the Western Suburbs of Mumbai collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X