వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతి రోజూ ఐదువేల కోట్లు కొత్త కరెన్సీ , ఆన్ లైన్ చెల్లింపులకు ప్రోత్సాహకాలు

పెద్ద నగదు నోట్ల రద్దును దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజూ ఐదువేల కోట్ల నగదును బ్యాంకులకు సరఫరాచేస్తామని ఆర్ బిఐ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి. ప్రతి రోజూ ఐదువేల కోట్లను అందుబాటులో ఉంచుతామని ఆర్ బి ఐ ప్రకటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మరింత నగదును అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్ బిఐ ప్రకటించింది.

పెద్ద నగదు నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకుగాను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రుల కమిటీ గురువారం నాడు ముంబాయిలో సమావేశమైంది.ఎపిలో చౌకధరల దుకాణాల్లో నగదు రహిత సేవలను ఏ రకంగా అమలుచేస్తున్నారో కమిటీ కన్వీనర్ చంద్రబాబునాయుడు వివరించారు. డిజిటల్ లావాదేవీలపై బ్యాంకు చార్జీలు రద్దు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు.

five thousand crores of new currency for banks

ఆధార్ అనుసంధాన ఆర్థిక లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు రద్దు చేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి. ఈ నెల 15 వ, తేది నుండి ఐదువందల రూపాయాలను పెద్ద ఎత్తున బ్యాంకులకు సరఫరా చేస్తామని సమావేశంలో ఆర్ బి ఐ ప్రకటించింది.

నగదు రహిత లావాదేవీలు ఇచ్చేవారికి ప్రోత్సహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అన్ని బ్యాంకులు అన్ని వాణిజ్య సముదాయాలు, వ్యక్తులకు క్యూఆర్ కోడ్ జారీ చేయాలని , నగదు రహిత లావాదేవీలకు యూఎస్ ఎస్ డీ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

English summary
five thousand crores of rupees everyday distribute to banks said rbi, cms meeting held on thursday at mubai. pay insentives who trascations on digital payment .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X