వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్‌టీటీఈపై ఐదేళ్ల నిషేధం పొడిగింపు: ట్రిబ్యునల్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై కేంద్రం విధించిన ఐదేళ్ల నిషేధాన్ని కొనసాగించాలా? వద్ధా అనే అంశంపై ఏర్పాటైన ట్రిబ్యూనల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న ఎల్‌టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు జడ్జీ నేతృత్వంలోని ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది.

దాదాపు వారం క్రితమే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై విధించిన నిషేధానికి ఆమోద ముద్ర లభించింంది. ఇందుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అప్పగించింది జస్టిస్ సంగీత ధింగ్రా సెహ్గల్ నేతృత్వంలోని ట్రిబ్యునల్. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులోని వర్గాల ద్వారా తెలిసిందని ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది.

Five year ban on LTTE: Tribunal headed by Delhi HC judge confirms

మరుమలర్చి ద్రావిడ మున్నేట్రా కళగమ్(ఎండీఎంకే) నేత, రాజ్యసభ ఎంపీ వైగో సహా మధ్యవర్తుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.

కాగా, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై మరో ఐదేళ్లపాటు నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎల్‌టీటీఈ ఇంకా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీంతో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు పొంచివుందని గెజిట్‌లో పేర్కొంది. దీంతో దీన్ని ఇంకా చట్ట వ్యతిరేక సంస్థగా కొనసాగించాల్సిన అవసరం ఉందని వివరించింది.

1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎల్‌టీటీఈపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. చివరిసారిగా 2014లో ఈ సంస్థపై నిషేధాన్ని పొడిగించింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎల్‌టీటీఈపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

English summary
The five-year ban imposed by the Centre on the Liberation Tigers of Tamil Eelam (LTTE) has been confirmed by a tribunal set up by the government to examine whether the prohibitions on the terror organisation should continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X