• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్ పంచాయతీల్లో పంద్రాగస్టున జాతీయ జెండా ఎగరేయండి.. గ్రామపెద్దలకు కిషన్ రెడ్డి ఆదేశం

|

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అసేతు హిమాచలంతో హిమసీమ కలిసిపోయింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తప్పుపడుతున్న పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ క్రమంలో కశ్మీర్‌లో 45 వేల మంది బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కర్ప్యూను సడలించారు. గతంలో కన్నా పరిస్థితి మెరుగ్గా ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

కశ్మీర్‌ భారతదేశంలో ఉన్న స్వయం ప్రతిపత్తి ఉంది. అందుకోసమే కశ్మీర్‌లో ప్రత్యేక జెండా ఎగరవేస్తారు. కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాలు రద్దవడంతో .. పంద్రాగస్టు రోజున జాతీయ జెండా ఎగరేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్‌లోని ఆయా గ్రామ పంచాయతీ పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించింది. ఈ నెల 15న జాతీయ జెండాను ఎగరవేయాలని గ్రామ పెద్దలను ఆదేశించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష తర్వాత ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇందుకోసం గ్రామపెద్దలు, ఇతర ప్రముఖలు కలుగజేసుకోవాలని కోరింది. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోన్న వేళ .. కశ్మీర్‌లో భారీగా భద్రతా దళాలను మొహరించారు.

flag host at kashmir villages at 15th aug.. home minister order

బీ అలర్ట్ ..

మరోవైపు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా విభాగం హెచ్చరించింది. భారత్‌కు నదీతీరం 7 వేల 514 కిలోమీటర్లు ఉంది. ఇందులో పాకిస్థాన్‌తో కూడా నదీ తీరం ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. 2008లో సముద్రమార్గాన ముంబైలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించడంతో దాడులకు తెగబడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇందుకు జలమార్గం ద్వారానే దేశంలోకి ప్రవేశించాలని ఉగ్ర మూకలు భావిస్తున్నాయని నిఘా విభాగానికి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తీరప్రాంతల్లో రాడార్లా ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఐబీ స్పష్టంచేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు రౌఫ్ అజార్ దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. అతను ఇప్పటికే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో వేగంగా పావులు కదుపుతున్నాడు. పీవోకేలో జైషే మహ్మద్ సంస్థ కోసం ఉగ్రవాదుల నియామక ప్రక్రియను భారీగా చేపట్టారు. ఆ క్యాంపుల నుంచి ఉగ్రవాదులను సరిహద్దు మీదుగా పంజాబ్ తరలిస్తున్నట్టు విశ్వసీనయంగా తెలిసింది.

English summary
Village heads of all Gram Panchayats of Jammu & Kashmir have been advised to hoist the national flag on 15th August says Union Minister of State Home G Kishan Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more