వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Flash Back 2019: గూగుల్‌ను కుళ్లబొడిచారు.. ఎక్కువగా ఏం సర్చ్ చేశారో తెలిస్తే షాకే..

|
Google Oneindia TeluguNews

2019 సంవత్సరం ఎన్నో మధురానుభూతులు, విషాద సంఘటనలు మిగిల్చింది. పలు సంఘటనలు దేశవ్యాప్తంగా నెటిజన్లు దృష్టిని ఆకర్షించాయి. కొన్ని సంఘటనల గురించి తెలియని విషయాలను నెటిజన్లు తెలుసుకోవడానికి గూగూల్స్ ఆశ్రయించి తమ సందేహాలను తీర్చుకొన్నారు. ప్రస్తుత ఏడాదిలో పలు విషయాలను ఎక్కువ‌గా శోధించిన విషయాలను ప్రజాదరణ పొందిన గూగుల్ విడుదల చేసింది. వాటిలో పలు వార్త విషయాలు, ప్రముఖులు, క్రీయలు, సినిమాలు, పాటలు లాంటి అంశాల గురించి నెటిజన్లు వెతికిన విషయాలు మీ కోసం..

370 ఆర్టికల్ అంటే ఏమిటి?

370 ఆర్టికల్ అంటే ఏమిటి?

2019లో ఎక్కవ మంది గూగుల్‌లో వెతికిన అంశాలల్లో 370 ఆర్టికల్ కావడం గమనార్హం. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? అయోధ్య కేసు అంటే ఏమిటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ఆఫ్ ఇండియా అంటే ఏమిటి? అనే ప్రశ్నలను నెటిజన్లు వెతికారని గూగూల్ తన రిపోర్టులో పేర్కొన్నది. ఇక గూగుల్ వెల్లడించిన టాప్ 5 సర్చ్‌లలో ఈ-సిగరెట్లు కూడా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని రిపోర్టులో పేర్కొన్నది.

ఇక సినిమా విషయానికి వస్తే..

ఇక సినిమా విషయానికి వస్తే..

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలకు విషయానికి వస్తే.. కబీర్ సింగ్, గల్లీబాయ్, మిషన్ మంగళ్, జోకర్, అవెంజర్స్: ఎండ్‌గేమ్, కెప్టెన్ మార్వెల్ తదితర చిత్రాల గురించి నెటిజన్లు విపరీతంగా శోధించారని తాజా నివేదకలో గూగుల్ వెల్లడించింది.

 క్రీడా అంశాల విషయానికి వస్తే

క్రీడా అంశాల విషయానికి వస్తే

ఇక క్రీడల విషయానికి వస్తే.. 2019లో క్రీడాభిమానులకు క్రికెట్ వరల్డ్ కప్ ఆనందం నింపింది. గూగుల్‌లో వరల్డ్ కప్ గురించి విషయాలు, ఆసక్తికరమైన అంశాలు, గణాంకాలు, క్రికెటర్ల వ్యక్తిగత రికార్డు వివరాల గురించి నెటిజన్లు విస్తృతంగా శోధించినట్టు గూగుల్ తాజా రిపోర్టులో వెల్లడించింది.

టాప్‌గా అభినందన్ వర్తమాన్

టాప్‌గా అభినందన్ వర్తమాన్

గూగుల్‌లో విస్త‌ృతంగా శోధించిన అంశాల్లో వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ టాప్ సర్చ్‌గా నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ఆనంద్ కుమార్, వికీ కౌశల్, రిషబ్ పంత్, రాను మొండల్ కూడా టాప్ సర్చ్‌లో నిలిచారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే టీవీ షో కూడా టాప్ సర్చ్‌లో ఒకటిగా మారింది.

చంద్రయాన్ 2, పుల్వామా దాడి గురించి

చంద్రయాన్ 2, పుల్వామా దాడి గురించి

జనరల్, సైన్స్ విభాగాల్లలో చంద్రయాన్ 2 గురించి నెటిజన్లు ఎక్కువ మంది సర్చ్ చేయగా, ఫనీ తుఫాన్, పుల్వామా ఉగ్రదాడి, రామజన్మభూమి, బాబ్రీపై సుప్రీం తీర్పు, అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు లాంటి అంశాల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిని ప్రదర్శించారు. అంతేకాకుండా ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి? ఓటర్ లిస్టులో పేరు తెలుసుకోవడం ఎలా అనే అంశాల గురించి కూడా నెటిజన్లు భారీగా సర్చ్ చేశారు అని గూగుల్ తాజా రిపోర్టులో వెల్లడించింది. అలాగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల గురించి కూడా నెటిజన్లు ఆసక్తిని ప్రదర్శించారని పేర్కొన్నారు.

English summary
Search engine giant Google India recently announced its 'Year in Search' results which spoke about standout moments in search across news, personalities, sportmuch events, movies, songs and more.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X