వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి ఫ్లెక్స్ ఇంజన్ బైక్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్వరలోనే ఇండియా మార్కెట్లోకి ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్స్‌ వస్తాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు.. రెండు బైక్స్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌, ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని గడ్కరీ ప్రకటించారు.

జనవరి నెలాఖరులోగా బైక్స్‌ను మార్కెట్లోకి తెస్తామని రెండు కంపెనీలు చెప్పాయని తెలిపారు. రెండు రకాల ఇంధనాలను ఫ్లెక్స్‌ ఇంజిన్‌లో వినియోగించొచ్చన్నారు మంత్రి గడ్కరీ. పెట్రోల్‌, ఇథనాల్‌లతో ఫ్లెక్స్‌ ఇంజిన్‌ బైక్స్‌ నడుస్తాయి. పెట్రోల్‌ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలనే వ్యూహంలో భాగంగా ఇథనాల్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు గడ్కరీ గుర్తు చేశారు.

Flex-Engine Bikes To Hit Indian Markets Soon, Says Gadkari

క్రూడ్‌ ఆయిల్‌ కోసం ప్రతి ఏటా రూ. 7 లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామని, ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్లను ఇథనాల్‌ వైపు మళ్లించినా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నారు నితిన్‌ గడ్కరీ . ఒక టన్ను వరి పొట్టు నుంచి 280 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చన్నారు గడ్కరీ.

గోధుమ పొట్టు, వెదురు చెట్ల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చని నితిన్ గడ్కరీ చెప్పారు.. ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగేందుకు అందుకు అనుకూలమైన పంటలను వేయాలని చెప్పారు. అమెరికా, బ్రెజిల్‌, కెనడాల్లో మెర్సిడెజ్‌, బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఫ్లెక్స్‌ ఇంజిన్‌తో నడుస్తున్నాయని గడ్కరీ గుర్తు చేశారు.

English summary
Two major bike makers are expected to soon come up with electric and flex engine motorcycles in the Indian markets, according to Union minister Nitin Gadkari. A flex-fuel or dual fuel vehicle is cap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X