వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా ప్రమాదం: రెండు సార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించినా..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని కోచికోడ్ విమానాశ్రయంలో కూలిపోయిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. కాగా, కోజికోడ్ వద్ద రన్‌వేపై దూసుకుపోయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేబుల్‌టాప్ విమానాశ్రయంలో కనీసం రెండుసార్లు ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినట్లు ఒక ప్రముఖ గ్లోబల్ ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్ పేర్కొంది.

Recommended Video

Kozhikode:ల్యాండ్ అయ్యే ముందు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!

190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 737 ఎన్జీ విమానం కోచికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు రెండుసార్లు ప్రయత్నించిందని ఫైట్ ట్రేడర్24 అనే స్వీడిష్ సంస్థ ఓ మ్యాప్‌లో రియల్ టైమ్ కమర్షియల్ ఫ్లైట్ ట్రాకింగ్ చేసింది. రెండుసార్లు ప్రయత్నించిన తర్వాత మూడోసారి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా, కోజికోడ్ ఎయిర్ పోర్టు టేబుల్ టాప్ ఎయిర్ పోర్టు అని జూనియర్ విదేశాంగ మంత్రి వీ మురళీధరన్ ట్వీట్ చేశారు. టేబుల్‌టాప్ రన్‌వే అనేది ఒక పీఠభూమి లేదా కొండ పైభాగంలో ఉన్న రన్‌వే.. ఒకటి లేదా రెండు చివరలను నిటారుగా ఉన్న ఎత్తుకు ఆనుకొని ఉంటుంది. ఇది ఒక ఇరుకు దారిని కలిగివుంది. ఇలాంటి విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అనేది ఒక సవాలేనని మంత్రి వ్యాఖ్యానించారు.

Flight Tracker Site Indicates Plane Tried To Land Twice At Kerala Airport

కాగా, ఈ విమాన ప్రమాద ఘటనలో విమానంలో మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విమానంలోని ప్రయాణికులందర్నీ బయటికి తీసి ఆస్పత్రులకు తరలించారు. 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

హెల్ప్‌లైన్ నెంబర్లు..

విమానంలో వర్షపు నీరు చేరుకున్న కారణంగా సరిగా రన్ వే కనిపించకపోవడంతో ఎయిరిండియా విమానం క్రాష్ అయ్యిందని, ఆ తర్వాత రెండుగా ముక్కలైందని ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. విమానంలో 191 మంది ఉన్నారని తెలిపింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా రన్ వేపై నీరు చేరడంతో విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. బోయింగ్ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోజికోడ్ విమాన ప్రమాదం : హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల 0543090572, 543090575, 0565463903, 0543090572

English summary
A popular global flight tracker website indicates that the Air India Express plane that skidded on the runway at Kerala's Kozhikode tried to land at least twice at the tabletop airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X