బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డెలివరీ బాయ్స్‌గా మారిన ఫ్లిప్‌కార్ట్ బాస్‌లు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బిగ్ బిలియన్ డే సెల్ ప్రకటించింది. దీంతో, రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ 'బాస్'లు (వ్యవస్థాపకులు) కూడా కొరియర్ బాయ్‌లా వస్తువులను కస్టమర్లకు అందిస్తున్నారు.

కస్టమర్లకు దగ్గరగా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా వారు స్వయంగా డెలివరీ చేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు ఒకరు బెంగళూరులో తమ ఉత్పత్తులను స్వయంగా కస్టమర్లకు అందించారు.

సచిన్ బన్సాల్, బిన్ని బన్సాల్‌లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ సహ వ్యవస్థాపకులు. ఇది బెంగళూరు బేస్డ్ ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్. ఇక్కడ సచిన్, బిన్నీలు కస్టమర్ల ఇంటికి వెళ్లి మరీ ఉత్పత్తులు ఇస్తున్నారు. వీరిద్దరు మరో పదిహేను ఇరవై రోజుల వరకు డెలివరీ బాయ్స్‌గా పని చేస్తారు.

ఫ్లిప్‌కార్ట్ సహయజమానులు అయిన సచిన్, బిన్నీలు 2007లో స్కూటర్ పైన వెళ్లి కస్టమర్లకు వస్తువులను అందించే వారు. అనంతరం వీరితో ముఖేష్ బన్సాల్‌తో కలిశారు.

Flipkart bosses turn delivery boys!

ఆ తర్వాత చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ పునిత్ సోనీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెవీ ఆనంద్ తదితరులు కూడా స్వయంగా కస్టమర్లకు వస్తువులు అందించినవారే. కాగా, సచిన్ బన్సాల్ కస్టమర్లకు వస్తువును డెలివలీ చేస్తున్న ఓ చిత్రాన్ని ట్విట్టర్‌లో ఉంచారు.

కాగా, పది గంటల్లోనే అర మిలియన్ మొబైల్స్ అమ్మామని ఫ్లిప్‌కార్ట్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రికార్డ్ అని ప్రకటించింది. ప్లిప్‌కార్ట్ మొత్తం 70 విభాగాల్లో 30 మిలియిన్ ప్రాడక్ట్స్‌ను ఉంచింది. అందులో పుస్తకాలు వంటి ఎన్నో ఉన్నాయి. కంపెనీలో 33,000 మంది ఉద్యోగులు ఉన్నారు. యాభై వేల మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు.

English summary
In an effort to personally connect with the customers, E-commerce major Flipkart has come up with a unique idea. The co-founders of the online marketplace are landing at the doorsteps of some of the customers in Bengaluru to deliver their products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X