బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ సేవలు

అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ తన సేవలను కొనసాగించనుంది.తన గ్రోసరీ డెలివరీ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. తన మొబైల్‌ అప్లికేషన్‌ ఈ సేవలను ఆవిష్కరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: అమెజాన్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ తన సేవలను కొనసాగించనుంది.తన గ్రోసరీ డెలివరీ సర్వీసులను ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించింది. తన మొబైల్‌ అప్లికేషన్‌ ఈ సేవలను ఆవిష్కరించింది. గత కొన్ని నెలల క్రితమే కేవలం తన ఉద్యోగులకు మాత్రమే ఈ సేవలను ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం వీటిని ఎంపిక చేసిన కస్టమర్లకు లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీ మార్కెట్‌ ప్లేస్‌లో కనీస ఆర్డర్‌ విలువ రూ.500 ఉండాలి. రూ.1000కి పైన ఆర్డర్లకు ఉచితంగా డెలివరీ చేయనున్నారు.

Flipkart launches grocery delivery service Supermart in Bengaluru

ఫ్లిప్‌కార్ట్‌పై గ్రోసరీ కేటగిరీలను సాఫ్ట్‌ లాంచ్‌ చేస్తున్నాం. బెంగళూరులో ఎంపికచేసిన కస్టమర్లకు ఈ సేవలందించనున్నాం. టెక్నాలజీ ద్వారా ఈ కామర్స్‌లోకి దేశాన్ని రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ సర్వీసులను ప్రారంభించాం. మా కస్టమర్లకు నిత్యావసర వస్తువులను తేలికగా అందించే షాపింగ్‌ సౌకర్యాన్ని అందించనున్నాం.

తొలుత బెంగళూరులో కస్టమర్లందరికీ ఈ సర్వీసులను లాంచ్‌ చేశాం. భవిష్యత్తులో అన్ని నగరాలకు వీటిని విస్తరిస్తాం'' అని ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2015లోనే నియర్‌బై యాప్‌ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ గ్రోసరీ డెలివరీ సర్వీసుల్లోకి వచ్చింది. కానీ కొన్ని నెలలకే ఈ సర్వీసులను మూసివేసింది. అమెజాన్‌ గతేడాది నుంచి ఎక్కువగా గ్రోసరీపై ఫోకస్‌ చేస్తోంది. పేటీఎం మాల్‌ తన ప్రధాన పెట్టుబడిదారి అలీబాబాతో కలిసి అతిపెద్ద గ్రోసరీ ఈటైలర్‌ బిగ్‌బాస్కెట్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Flipkart, one of India's largest e-commerce platforms, quietly dived into the grocery delivery business once again with the launch of Supermart in Bengaluru. The new initiative looks to take on the likes of Amazon India and grocery delivery app BigBasket, to name a few. The launch of Supermart comes following a pilot project that began a few months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X