వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూతపడనున్న ఫ్లిప్‌కార్ట్ సైట్: అన్నీ యాప్ ద్వారానే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ సెప్టెంబర్ నుంచి తన వెబ్‌సైట్‌ను మూసివేయనుంది. ఈ విషయాన్ని సంస్ధ ఛీప్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని మంగళవారం తెలియజేశారు. గతవారం టౌన్ హాలులో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను మూసేసి, కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు సాగించాలనేది తమ ఉద్దేశమని తెలిపినట్లు సమాచారం.

ప్లిప్‌కార్ట్ కొనుగోళ్లలో 70 శాతం మొబైల్ ఆధారంగానే సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను మూసేస్తారని గతంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Flipkart may shut website and go app only by September

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్యాషన్ వెబ్‌సైట్ మింత్రా ఇటీవలే మొబైల్ ఆధారిత సేవలకు మారిన సంగిత తెలిసిందే. మొబైల్ ఆధారిత సేవలకు మారిన తర్వాత అమ్మకాల్లో కేవలం 10 శాతం మాత్రమే తగ్గాయని 90 శాతం ట్రాఫిక్ వస్తుందని తెలిపారు.

ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్‌లకు సంబంధించిన యాప్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ సంస్ధ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని వాడే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను ఇనిస్టాల్ చేసుకోవచ్చు.

English summary
Bangalore based e-retailer, Flipkart, could close its website by September and operate under an app only model like its fashion subsidiary Myntra, claims a report in the Times of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X