వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌లకు పెరుగుతోన్న క్రేజ్! వీటిపైనే భారతీయ నిపుణుల దృష్టి!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకప్పుడు గ్లోబల్ టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, అమెజాన్‌ల‌లో ఉద్యోగం లభిస్తే చాలు జన్మ ధన్యం అనుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. విదేశీ టెక్ దిగ్గజాలపై భారతీయుల్లో క్రేజ్‌ తగ్గిపోయింది.

ఎందుకంటే, దేశీయ టెక్‌, మొబైల్‌ కంపెనీలకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. భారతీయ నిపుణులు ఎక్కువగా డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం)లలో పనిచేయాలనుకుంటున్నారని లింక్డ్‌ఇన్‌ బుధవారం ఓ రిపోర్టులో వెల్లడించింది.

భారతీయ నిపుణులు ఇష్టపడుతున్న కంపెనీలు...

భారతీయ నిపుణులు ఇష్టపడుతున్న కంపెనీలు...

గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, అమెజాన్‌ కంపెనీల్లో కంటే దేశీయ టెక్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ కంపెనీల్లో పని చేసేందుకే భారతీయ నిపుణులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ ఒక నివేదికలో వెల్లడించింది.భారతీయ నిపుణులు ఎక్కువగా పనిచేయాలని కోరుకునే 25 కంపెనీల ర్యాంకింగ్‌లు కూడా ఈ సంస్థ వెల్లడించింది. కంపెనీలో ఆసక్తి, కంపెనీ ఉద్యోగులతో ఎంగేజ్‌మెంట్‌, ఉద్యోగ డిమాండ్‌, ఉద్యోగ నిలుపుదల అనే నాలుగు అంశాలను తీసుకుని లింక్డ్‌ఇన్‌ ఈ నివేదిక రూపొందించింది.

అమెజాన్ 4వ స్థానం, గూగుల్ 7వ స్థానం...

అమెజాన్ 4వ స్థానం, గూగుల్ 7వ స్థానం...

ఈ జాబితాలో లింక్డ్‌ఇన్‌, పేరెంట్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లను కలపలేదు. గత రెండు సంవత్సరాలుగా రెండో స్థానంలో ఉంటూ వస్తున్న అమెజాన్‌, ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. మొదటి మూడు కంపెనీలుగా డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్(పేటీఎం) ఉన్నాయి. గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ కూడా టాప్‌ 25 కంపెనీల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

ఏడాదిలో 11 స్థానాలు పడిపోయిన ఓలా...

ఏడాదిలో 11 స్థానాలు పడిపోయిన ఓలా...

టాప్‌ కంపెనీల జాబితాలో ఎక్కడ భారతీయులు ప్రస్తుతం పనిచేయాలనుకుంటున్నారు, దేశీయ కంపెనీల నుంచి గ్లోబల్‌ దిగ్గజాల వరకు ఏ కంపెనీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుపుతూ ఈ జాబితాను విడుదల చేసినట్టు లింక్డ్‌ఇన్‌ ఇండియా ఎడిటర్‌ అదిత్‌ చార్లీ అన్నారు. ఈ జాబితాలో 2017లో ఐదో స్థానంలో ఉన్న ఓలా 11 స్థానాలు పడిపోయి, 16వ ర్యాంకులో నిలిచింది.

తొలి మూడు స్థానాల్లో పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌...

తొలి మూడు స్థానాల్లో పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌...

డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్స్‌, అమెజాన్‌, అనెషీర్-బుష్ ఇబ్వ్ , మెకిన్సే అండ్‌ కంపెనీ, ఆల్ఫాబెట్‌, కేపీఎంజీ ఇండియా, ఈవై, ఓవైఓ, డైమ్లెర్‌ ఏజీ, అడోబ్‌, ఎక్స్‌పీడియా, మోర్గాన్‌ స్టాన్లీ, డీబీఎస్‌ బ్యాంకు, ఓలా, జీఈ, మేక్‌మైట్రిప్‌, పీడబ్ల్యూసీ, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌, షెల్‌, జేపీమోర్గాన్‌ ఛేస్‌ అండ్‌ కంపెనీ, యూనిలివర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డెలాయిట్‌ ఇండియా కంపెనీలలో పనిచేసేందుకే భారతీయ నిపుణులు అధిక ఆసక్తి చూపుతున్నారట.

English summary
Professionals in India prefer home-grown tech and mobile Internet companies like Directi, Flipkart and One97 Communications (Paytm) more than global giants like Google and Amazon as their workplace, revealed a new LinkedIn report on Wednesday. The report includes the ranking of 25 companies in the country that are most sought after by professionals, based on proprietary LinkedIn data and billions of actions by more than 546 million professionals on the platform. "The Top Companies list is based on the billions of actions taken by LinkedIn members and looks at four main pillars: interest in the company, engagement with the company's employees, job demand and employee retention," LinkedIn revealed. LinkedIn and parent company Microsoft were excluded from the list. Amazon, which held the second spot for the past two consecutive years in the list, is now ranked fourth in the list after the top three companies - Directi, Flipkart and One97 Communications - respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X