• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గూగుల్ నన్ను తిరస్కరించడంతోనే ఫ్లిప్ కార్ట్‌ సాధ్యమైంది: బిన్నీ బన్సాల్

|

గూగుల్‌లో తనను రెండు సార్లు తిరస్కరించారని ఆ తర్వాతే ఫ్లిప్ కార్ట్ పెట్టాలన్న ఆలోచన వచ్చిందని ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఎలా స్థాపించారో చెబుతూ ఓకార్యక్రమం ఇష్టాగోష్టిలో బిన్నీ బన్సాల్ పాల్గొన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాకా... బిన్నీ విజన్ టెక్నాలజీపై పరిశోధన చేస్తున్న సార్నాఫ్ కార్ప్ అనే కంపెనీలో పని చేశారు. ఈ కంపెనీలో పనిచేస్తున్న సమయంలోనే అంటే 2005,2006లో తను గూగుల్‌కు అప్లై చేసుకున్నట్లు తెలిపిన బిన్నీ... రెండు సార్లు తను తిరస్కరణకు గురైనట్లు తెలిపింది. తనకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

ఈరోజు తను అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటున్నట్లు బిన్నీ చెప్పారు. అదే ఫ్లిప్‌కార్ట్ నుంచి పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేలా తన భార్యను ఒప్పించడం తనకు అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పారు. ఆమె పండ్లను కూరగాయలను బిగ్ బాస్కెట్ నుంచి కొనుగోలు చేయడం తనకు ససేమిరా ఇష్టం లేదన్నారు. తన సోదరుడు సచిన్ గురించి కూడా బిన్నీ ప్రస్తావించారు. సచిన్ తనను అమెజాన్ సంస్థకు రిఫర్ చేసి పెద్ద బోనస్ కొట్టాడని గుర్తు చేసుకున్నాడు బిన్నీ. అయితే కేవలం 8నెలలే అక్కడ పనిచేసి బయటకొచ్చినట్లు కూడా చెప్పాడు.

Flipkart was possible because Google rejected me twice,says Binni Bansal

బిన్నీ ఈ విషయాలను చెబుతున్నప్పుడు అక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తికరంగా విన్నారు. ఇప్పటికీ తాము డోర్‌ టూ డోర్ డెలివరీ చేయడంతో పాటు వారి కస్టమర్లతో మాట్లాడుతుంటామని బిన్నీ చెప్పారు. కొందరికి తాము ఎవరో తెలియక సాధారణంగా మాట్లాడుతారని మరికొందరు తమతో ఫోటో తీసుకుంటారని బిన్నీ చెప్పాడు. ఇలాంటి అనుభవమే బిన్నీ చెప్పుకొచ్చాడు. ఒకసారి ఓ కస్టమర్ ఇంటికి తాము వెళ్లామని..తనను గుర్తుపట్టిన కస్టమర్ సకల మర్యాదలు చేశాడని చెప్పాడు. వివిధ రకాల ఆహారం పెట్టి తన కడుపును నింపేశాడని చెప్పాడు. టీ, తర్వాత స్వీట్లు పెట్టాడని చెప్పిన బిన్నీ... కస్టమర్ తమకు రాజులాంటి వాడు కాబట్టి... కడుపు నిండినప్పటికీ ఇంకా ఏదో ఆహారం పెడుతున్నా కాదనలేకపోయామని చెప్పాడు. అంతేకాదు తను స్కూలులో చదివిన విషయాలు, ఢిల్లీ ఐఐటీలో తను పెనవేసుకున్న జ్ఞాపకాలను ఆడియెన్స్‌తో పంచుకున్నారు బిన్నీ బన్సాల్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“How did Flipkart map into existence? Because Google rejected me twice,” mentioned Binny Bansal.The co-founding father of Flipkart, in a free-wheeling chat on Thursday at SAP Labs India’s originate of its 2nd accelerator programme, spoke on issues infrequently ever touched, joked with the target market and gave colourful anecdotes about the firm he constructed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more