వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్‌తో సరసాలా ? మధ్యప్రదేశ్‌ రిటైర్డ్‌ జడ్డికి సీజేఐ బాబ్డే చీవాట్లు- పిటిషన్‌ వెనక్కి

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్‌ అయిన జడ్డిపై ఆయన జూనియర్‌ అధికారి ఓ ఫిర్యాదు చేసింది. జడ్డిగా పనిచేసిన కాలంలో తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టు దీన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సదరు న్యాయమూర్తికి ఛీఫ్ జస్టిస్‌ బాబ్డే చీవాట్లు పెట్టారు.

మధ్యప్రదేశ్‌ జిల్లా కోర్టులో జడ్డిగా పనిచేసినప్పుడు సదరు న్యాయమూర్తి తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించి, ఆధారాలు కూడా సమర్పించిన జూనియర్ అధికారి ఆ తర్వాత ఆరోపణలు ఉపసంహరించుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌ హైకోర్టు తనపై చేపట్టిన విచారణ నిలిపేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డే.. బాధితురాలు తన ఆరోపణలు వెనక్కి తీసుకున్నంత మాత్రాన విచారణ నిలిపేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

Flirting with junior unacceptable conduct for a judge: CJI Bobde on MP judge accused of harassment

జూనియర్‌ అధికారితో సరసాలు, అనుచిత ప్రవర్తన ఓ న్యాయమూర్తి స్ధాయికి తగినవి కావని సుప్రీం ఛీఫ్‌ జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ఈ మేరకు సదరు జడ్జి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేకపోతే తామే పిటిషన్‌ కొట్టేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు జడ్డిపై వచ్చిన ఆరోపణలను నిజమని తేల్చిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. అయితే వీటిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్ ఆదేశాలు ఇచ్చారు.

English summary
The retired District Judge from Madhya Pradesh had moved the Supreme Court seeking dismissal of an enquiry against him by the MP HC on the basis of a complaint of sexual harassment filed by a female officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X