వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Floccinaucinihilipilification .. ఈ పదానికి అర్థం ఏంటో తెలుసా.. ఆర్బీఐ గవర్నర్ కామెంట్‌

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ ఆర్థికవృద్ధి ఊహించినంత లేదు. అభివృద్ధి కోసం ఏం చేద్దామనే అంశంపై మేధావులు, ఆర్థిక నిపుణులు వ్యుహరచన చేస్తున్నారు. దేశం గణనీయమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన ప్రణాళిక కోసం కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇంతలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్థిక ప్రగతిపై ఓ కీలక వ్యాఖ్య చేశారు. అయితే అది 18వ శతాబ్ధానికి చెందినది కావడం విశేషం. ఆ పదానికి అర్థం వెతికేందుకు నిపుణులే గూగుల్‌లో శోధించారంటే సాధారణ విషయమేమి కాదు. ఇంతకీ ఆ పదం ఏంటీ ? దానికున్న ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం పదండి.

భారతదేశ ఆర్థిక ప్రగతి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేంద్ర బ్యాంకుల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక ప్రగతి గురించి మాట్లాడుతూ Floccinaucinihilipilification అని కామెంట్ చేశారు. దీంతో అక్కడున్న మేధావులు, నిపుణులు ఆశ్చర్యపోయారు. ఏమన్నారు అని మరోసారి విన్న అర్థం కాలేదు.

Floccinaucinihilipilification’: The word RBI used while talking about economic forecast

ఇంకేముంది గూగుల్‌లో కూడా సెర్చ్ చేశారు. దేశ ఆర్థిక ప్రగతి గురించి ఆందోళన చెందడమేనని తర్వాత తెలిసి .. హమ్మయ్య అనుకున్నారు. లేదంటే వారికి ఆ పదం తెలియక నిద్ర కూడా పట్టేది కాదెమో. దేశ ఆర్థిక ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని శక్తికాంత దాస్ ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ పదం వాడారు. దేశ వృద్ధి జరుగుతుంది .. కానీ ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. దీనికి మన నిపుణులు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో వెతికితే అర్థం దొరికింది. అంతేకాదు ఇదీ 18వ శతాబ్ధంలో వాడారని కూడా తర్వాత తెలిసింది.

English summary
As India’s economic climate becomes more complicated, so have the messages from monetary policy makers. Central bank watchers were left scrambling this week for their dictionaries and Google searches to decipher parts of a speech by Governor Shaktikanta Das and minutes of the recent monetary policy committee meeting. In the minutes, published on Wednesday, MPC member Chetan Ghate said “estimates of economic growth in India have unfortunately been subject to a fair degree of floccinaucinihilipilification. Notwithstanding this, growth is likely to pick up.” The Oxford dictionary says the word is a rare one originating in the mid-18th century to describe the action of estimating something as worthless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X